కొండా సురేఖ మంత్రి పదవి ఔట్.. TPCC చీఫ్ క్లారిటీ! నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పదవి నుంచి కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం తొలిగిస్తుందనే దానిపై టీపీసీసీ చీఫ్ మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎటువంటి వివరణ తమను కోరలేదని చెప్పారు. By V.J Reddy 12 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Mahesh Goud : సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం ముగిసిన అంశమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఆ రోజే వెనక్కు తీసుకున్నారని.. అంతటితో ఇష్యూ ముగిసిందని పేర్కొన్నారు. అయినా కొందరు పనిగట్టుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. రేవంత్ కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తాంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం సైతం ఎటువంటి వివరణ తమను కోరలేదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ వైఖరి వల్లే కొండా సురేఖ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆమె అలా మాట్లాడాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశంలో హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఈ కేసులో కోర్టు ఏం చెబుతుందో చూద్దామన్నారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని, తాము ఏనాడూ దుర్వినియోగం చేయలేదని అన్నారు. డబ్బులు వెదజల్లి మరీ తమ మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సురేఖ, సీతక్క బలమైన నాయకులు కాబట్టే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ.. ఇక దసరా పండగ వేళ.. రెండో విడత కార్పోరేషన్ పదవులు కేటాయించాలని ముందుగా అనుకున్నామన్నారు. కానీ కుదరలేదని చెప్పారు. ఏఐసీసీ నేతలంతా బీజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు ఆలస్యమైందన్నారు. పండుగ తర్వాత అవి కూడా భర్తీ చేస్తామని తెలిపారు. Also Read : తమిళనాడు రైలు ప్రమాదం..18 రైళ్లు రద్దు! #revanth-reddy #konda-surekha #nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి