తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణ క్యాడర్‌లో విధులు నిర్వర్తించి డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ మళ్లీ రాబోతున్నారు. డ్రగ్స్ ఫీ స్టేట్‌గా మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకురానున్నట్లు సమాచాారం. By Kusuma 12 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ మళ్లీ తెలంగాణలో విధులు నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వహించడానికి వెళ్లిన అకున్ సబర్వాల్‌ను రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తెప్పిస్తున్నారని సమాచారం. అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణలో సంచలనాలు సృష్టించిన కేసుల విషయంలో వ్యవహరించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం అకున్ సబర్వాల్ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చూడండి: బాలయ్య, బోయపాటి 'BB4' నుంచి బిగ్ అప్డేట్.. మూవీ ఓపెనింగ్ ఆరోజే రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్.. ప్రస్తుతం ఐటీబీపీ ఐజీగా విధులు నిర్వహిస్తున్న అకుల్ సబర్వాల్ తెలంగాణకు మళ్లీ వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిన్న అకున్ సబర్వాల్‌ను తెలంగాణకు రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలనే ఉద్దేశంతో స్మితా సబర్వాల్ భర్త అయిన అకున్ సబర్వాల్‌ను మళ్లీ తెలంగాణకు తీసుకువస్తున్నారట. టాలీవుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్ కేసులు ఎక్కువ కావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది కూడా చూడండి: సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు #telangana #revanth-reddy #akun-sabarwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి