తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు! రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను 60రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో18 జారీ చేశారు. By Seetha Ram 13 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు కుటుంబ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిని నిర్ణయించారు. 60 రోజుల్లో పూర్తి చేయాలి దీనికి శాసనసభ ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రీసెంట్‌గా జీవో 18 జారీ చేశారు. ఈ సర్వే ప్రక్రియ మొత్తం బాధ్యతను నోడల్ విభాగంగా ప్రణాళిక శాఖకు అప్పగించారు. ఇది కూడా చదవండి: సొంతూర్లో దసరా పండుగ జరుపుకున్న సీఎం రేవంత్.. ఇందులో భాగంగానే సమగ్ర కుల గణనకు బీసీ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల కొత్త కమిషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. దీని తరువాత ఆ ప్రక్రియను మరింత వేగం చేసింది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు, బీసీ కమిషన్లు అనుసరించిన ప్రక్రియలు, బిహార్‌లో చేపట్టిన కుల గణనను ప్రభుత్వం కూలంకషంగా పరిశీలించింది. కాగా రాష్ట్రంలో కుల సర్వే వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ సమావేశంలో ఇటీవల ఆదేశించారు. ఇది కూడా చదవండి: దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు అయితే తమ దగ్గర అవసరమైన యంత్రాంగం లేదని కమిషన్ ఛైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. దీంతో సీఎం ప్రణాళిక విభాగంతో కలసి నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సర్వేను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. దీని తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాతే కుల సర్వే ప్రక్రియ వేగం పుంజుకుని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. #revanth-reddy #caste-census #telangana-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి