BIG BREAKING: ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అలాగే టెట్ వివరాలపై అభ్యంతరాలను కూడా కరెక్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అలాగే టెట్ వివరాలపై అభ్యంతరాలను కూడా కరెక్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
తెలంగాణ గ్రూప్-2 ఫైనల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 783 ఉద్యోగాలకు 777 మంది అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మే 29 నుంచి జూన్ 10వ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ తెలిపారు.
తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. కానీ ఇకపై మెమోలను సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ అడ్వాన్సడ్, సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్ యాప్,లీప్ మొబైల్ యాప్ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ ఫోన్లో కూడా రానున్నాయి.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. వారు ఫోర్జరీ దస్త్రాలు ఉపయోగించారని గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఏప్రిల్ 19న ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని ప్రకటించగా అది కుదరలేదు. ఏప్రిల్ 18న ఫైనల్ కీ ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.