/rtv/media/media_files/2026/05/17/ts-2026-2026-05-17-12-15-17.jpg)
తెలంగాణ ఎప్‌సెట్-2026 (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్‌కుమార్ రెడ్డి తదితరులు కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది 1,97,241 మంది పరీక్షకు హాజరు కాగా 1,44,704 మంది అర్హత సాధించారు. పాస్ పర్సంటేజ్: 73.36% గా ఉంది.
ఇంజినీరింగ్ టాప్ 5 ర్యాంకర్లు:
- మొదటి ర్యాంక్: ఎం. రుషి (మేడ్చల్-మల్కాజిగిరి, ఉప్పల్) - 156.63 మార్కులు
- రెండో ర్యాంక్: బెజుగామ అన్షుల్ (మూసాపేట, హైదరాబాద్) - 148.70 మార్కులు
- మూడో ర్యాంక్: మారక వంశీధర్‌రెడ్డి (కడప, పులివెందుల) - 147.05 మార్కులు
- నాలుగో ర్యాంక్: జొన్నల రోషన్ మణిదీప్‌రెడ్డి (గుంటూరు) - 144.44 మార్కులు
- ఐదో ర్యాంక్: ఆడుల సాయినిఖిత్ (మహబూబ్‌నగర్) - 143.30 మార్కులు
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 73,294 మంది అర్హత సాధించారు. పాస్ పర్సంటేజ్: 86.27% గా ఉంది.
అగ్రికల్చర్ టాప్ 3 ర్యాంకర్లు:
- మొదటి ర్యాంక్: ముకర్రమ్ అహ్మద్ (హైదరాబాద్) - 150.17 మార్కులు
- రెండో ర్యాంక్: తాడూరి నివృత్ సాయి వెంకట్ (హైదరాబాద్) - 143.43 మార్కులు
- మూడో ర్యాంక్: సాహితి గీతిక గుణిశెట్టి (రంగారెడ్డి) - 142.35 మార్కులు
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Follow Us