New year Changes 2025: నేటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే!
నేటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరుగుదల, అమెజాన్ ప్రైమ్ యూజర్ల డివైజ్ కనెక్ట్‌ను తగ్గించడం, యూపీఐ లిమిట్, గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి.
నేటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరుగుదల, అమెజాన్ ప్రైమ్ యూజర్ల డివైజ్ కనెక్ట్‌ను తగ్గించడం, యూపీఐ లిమిట్, గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.6 వేలు ఇస్తుండగా.. దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
న్యూ ఇయర్ వేళ IRCTC సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్సైట్ పనిచేయడం లేదు. దీంతో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు.
మహారాష్ట్ర మంత్రి రాణే నోరు పారేసుకున్నారు.కేరళ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చడమే కాకుండా అక్కడి ప్రజలను ఉగ్రవాదులతో పోల్చారు. అందుకే రాహుల్, ప్రియాంక్ ఇద్దరు గెలిచారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్‌ను కలిసేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వాళ్లపై లాఠీఛార్జీ చేశారు. వాటర్ కెనన్లు ప్రయోగించారు.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలకు సమీపంలోనే ప్రతిష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. రేపు జరిగే సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని ఎమ్మె్ల్సీ కవిత తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలన్నారు. లేకపోతే నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.
యూపీలోని సంభాల్‌లో జామా మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొత్త పోలీస్ పోస్టును నిర్మించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ స్థలంలో పోలీస్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
2009లో మన్మోహన్ సింగ్‌కు ఆస్పత్రిలో 10 గంటలకు పైగా హార్ట్ సర్జరీ జరిగింది. ఇది ముగిశాక స్ప్రుహలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ నా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉందని వైద్యులను అడిగాడు. సర్జరీ గురించి తనకు బెంగ లేదని.. దేశం గురించే ఆందోళన చెందుతున్నానని చెప్పారు.