Telangana: తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలకు సమీపంలోనే ప్రతిష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. రేపు జరిగే సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

New Update
Manmohan Singh - Revanth Reddy

Manmohan Singh - Revanth Reddy

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(92) గురువారం మరణించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో శనివారం రోజు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. అయితే అతని స్మృతిగా సచివాలయం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఓ కొత్త పథకాన్ని ప్రారంభించి.. దానికి దివంగత మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని భావిస్తోంది.

ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలకు సమీపంలోనే..

శనివారం రోజు ఢిల్లీలో జరిగిన అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు హాజరయ్యారు. మన్మోహన సింగ్‌ మృతికి సంతాపం తెలియజేస్తూ.. ప్రత్యేకంగా ఈ నెల 30న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలు అసెంబ్లీ ఎదురుగా ఉన్నాయి. వీటికి సమీపంలోనే మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌(92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో శనివారం ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పాడే మోశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాజీ ప్రధానికి చివరి వీడ్కోలు పలికారు.

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

ఇది కూడా చూడండి:  ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు