IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 65 రోజుల్లో 74 మ్యాచులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి.
RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విరాట్ కోహ్లీ శుభాంకాక్షలు తెలిపారు. కెప్టెన్సీ పెద్దబాధ్యతే అయినప్పటికీ.. టీమ్‌లోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలుస్తామన్నారు. ఆర్సీబీకి చాలామంది కెప్టెన్సీ వహించారని.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి పాటిదార్ వచ్చాడని పేర్కొన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది. 2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు రజత్ పాటిదార్.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ తోపాటు ఐపీఎల్లో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది.
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు ఆ ఫాంఛైజీ తెలిపింది. గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇందులో పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2025 టోర్నీలో అన్‌సోల్డ్‌గా మిగలడం తీవ్రంగా కలిచివేస్తోందని భారత బౌలర్ ఉమేష్ యాదవ్ అన్నాడు. 150 మ్యాచులు ఆడిన తాను ఇప్పటికీ 140కి.మీ వేగంతో బంతులు వేయగలనని చెప్పాడు. తన పేరు వచ్చేసరికి ఫ్రాంచైజీల వద్ద డబ్బులు అయిపోయాయేమో అని సెటైర్స్ వేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18 షెడ్యూల్ రిలీజైంది. ఈ మెగాటోర్నీ మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ అనంతరం వెల్లడించిన ఆయన ఫైనల్ మ్యాచ్ మే25న జరగనున్నట్లు తెలిపారు.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు చేపడతాడని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదన్నాడు. ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడని ఏబీడీ తెలిపాడు.