Virat kohli: RCB కొత్త కెప్టెన్‌పై కోహ్లీ సంచలన వీడియో..!

RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విరాట్ కోహ్లీ శుభాంకాక్షలు తెలిపారు. కెప్టెన్సీ పెద్దబాధ్యతే అయినప్పటికీ.. టీమ్‌లోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలుస్తామన్నారు. ఆర్సీబీకి చాలామంది కెప్టెన్సీ వహించారని.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి పాటిదార్ వచ్చాడని పేర్కొన్నారు. 

New Update
virat kohli breaks silence on rcb captaincy change

virat kohli breaks silence on rcb captaincy change

Virat kohli: ఐపీఎల్ 2025(IPL 2025)కి రంగం సిద్ధమైంది. త్వరలో ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ 2025 (IPL 2025) కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది. విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం నడించింది. కానీ కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతోనే యాజమాన్యం రజత్ పాటిదార్ పేరును ప్రకటించింది. 

Also Read :  రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

కెప్టెన్సీ పెద్ద బాధ్యతే

ఈ ప్రకటన అనంతరం ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. కెప్టెన్సీ అనేది పెద్ద బాధ్యతే అయినప్పటికీ.. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలుస్తారని అన్నాడు. ఈ మేరకు విరాట్.. ఆర్సీబీకి చాలా మంది కెప్టెన్సీ వహించారని.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రజత్ పాటిదార్ వచ్చాడని అన్నారు. 

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

అతడి వెనుకుంటాం

గతంలో ఎలాగైతే కెప్టెన్‌లు జట్టును నడిపించారో.. వారి మాదిరిగానే పాటిదార్ కూడా ముందుకు నడిపిస్తాడని ప్రతి ఒక్కరికీ చెప్పగలనని అన్నారు. అది మాత్రమే కాకుండా జట్టులో అతడు ఎదిగిన తీరు ఎంతో అద్భుతమని.. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ అతడికి మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. కెప్టెన్సీ అనేది చాలా పెద్ద బాధ్యతే అయినప్పటికీ.. సహచర క్రికెటర్లుగా తామంతా అతడి వెనుకుంటాం అని చెప్పారు. 

Also read :  మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

ఇది గొప్ప గౌరవం

తాను కెప్టెన్‌గా చాలా ఏళ్లు ఉన్నానని.. అనంతరం డుప్లెసిస్ గత రెండేళ్లు జట్టును నడిపించాడని.. ఇప్పుడు రజత్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని చెప్పుకొచ్చారు. అతడు టీమ్‌ను మెరుగ్గా ముందుకు తీసుకుపోతాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది అతడికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. వచ్చే సీజన్‌ను పాటిదార్ కెప్టెన్సీలో గొప్పగా ప్రారంభిస్తామని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు