ఐపీఎల్ ముందు రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ దెబ్బ.. ఆటకు సంజూ దూరం?

రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌ తోపాటు ఐపీఎల్‌లో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది.

New Update
Sanju Samson

Sanju Samson Photograph: (Sanju Samson)

రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ ముందు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్‌ విసిరిన బాల్ సంజూ చూపుడు వేలుకి బలంగా తాకింది. దీంతో భారత్ బౌలింగ్ సమయంలో సంజూ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ద్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఈ గాయం కారణంగా సంజూ క్రికెట్‌కు కనీసం ఆరు వారాల పాటు దూరంగా ఉండాలని నిపుణులు సూచించారు.

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

గాయం కారణంగా..

ప్రస్తుతం సంజు శాంసన్ తిరువనంతపురంలోని తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడటం కూడా కష్టమే. ఈ గాయం పూర్తిగా నయం అయిన తర్వాత మళ్లీ ఆట మొదలు పెట్టే అవకాశం ఉంది. గాయం తగ్గకపోతే ఐపీఎల్‌కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL Match Fixing: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను హైదరాబాద్ వ్యాపారి సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

New Update
list

IPL 2025 Match Fixing Hyderabad businessman

IPL Match Fixing: ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

కుటుంబాలకు ఖరీదైన బహుమతులు..

ఈ మేరకు ఆటగాళ్లతోపాటు, కోచ్‌, సహాయక సిబ్బంది, యజమానులు, వారి కుటుంబాలకు ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే దీని వెనక హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి బుకీలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని, అతను గతంలోనూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ACSU వార్నింగ్ ఇచ్చింది. అతడితో ప్రస్తుతం ఏ విధమైన రిలేషన్ పెట్టుకోవద్దని, ముఖ్యంగా టోర్నీకి సంబంధించిన అంశాలను అతనితో ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఎలా దగ్గరవుతాడంటే..

ఐపీఎల్ జట్లు బస చేస్తున్నహోటల్‌లో ఆటగాళ్లను కలుస్తాడు. వారిని ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానిస్తాడు. జట్టు సభ్యులతోపాటు వారి కుటుంబాలకు బహుమతులు ఇస్తాడు. మొదట టీమ్ ఫేవరేట్ ఫ్యాన్స్ గా నటిస్తూ ఖరీదైన హోటళ్లు, ఆభరణాల దుకాణాలకు తీసుకెళ్తాడు. సోషల్ మీడియాలోనూ విదేశాల్లో ఉంటున్న ఆటగాళ్లు, యజమానుల బంధువులను సంప్రదించి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

IPL 2025 | match-fixing | today telugu news 

Advertisment
Advertisment
Advertisment