కెనడాలో దారుణం.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మొజ్తబా ఖమేనీ చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ వీటిపై స్పందించింది. ఖమేనీ రష్యాలో ఉన్నట్లు వచ్చిన వార్తలు తప్పుడు కథనాలని రష్యాలో ఉన్న ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ వెల్లడించారు.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో హర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ ఇంధన సంక్షోభ ప్రభావం థాయ్‌లాండ్‌లో అంత్యక్రియలపై పడటం కలకలం రేపుతోంది. అక్కడ డీజిల్ లేక ఓ ప్రాంతంలో దహన సంస్కారాలను ఆపేశారు.
అఫ్గానిస్థాన్‌లో కాబుల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానికి దాడుల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన భారత్.. పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద, అమానుష చర్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం టెహ్రాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆయనకి అక్కడి ప్రభుత్వం చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలమైన ఖర్గ్ ఐలాండ్‌పై ఇటీవల అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్ రూట్ మారింది. ఏకంగా ఆ ఐలాండ్నే స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు యాక్సియోస్ అనే న్యూస్ ఏజెన్సీ తమ కథనంలో వెల్లడించింది.
ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలసిందే. ఆ రూట్లో ఇంధన సరఫరా ఆగిపోవడంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. తాజాగా మరో ముప్పు పొంచి ఉంది. బాబ్ ఎల్‌మండేబ్ అనే జలసంధి కూడా మూతపడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.