Iran War: ఇరాన్‌కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో మరో కీలక నేత హతం

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి.

New Update
Israel killed Ali Larijani, the head of Iran’s Supreme National Security Council

Israel killed Ali Larijani, the head of Iran’s Supreme National Security Council

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. రాత్రికి రాత్రే జారిపిన మిస్సైల్ దాడుల్లో లారిజానీ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్  రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన లారిజానీ మృతి చెందడం చర్చనీయాంశమవుతోంది. 

Also Read: 90 మైళ్ల దూరం.. 60 ఏళ్ల వైరం.. క్యూబాపై ట్రంప్ కన్నేయడానికి కారణాలివే!

దాడి ఎలా జరిగింది ?

ఇజ్రాయెల్ నిఘా విభాగం పక్కా సమాచారంలో ఈ దాడులు నిర్వహించింది. ఇరాన్ సరిహద్దుల్లోని ఓ రహస్య ప్రాంతలో లారిజానీ పర్యటిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కచ్చితత్వంతో క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో లారిజానీతో సహా ఆయన భద్రతా సిబ్బంది కూడా మ-ృతి చెందారు.  

అలీ లారిజానీ ఎవరు?

అలీ లారిజానీ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ఈయన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌గా, అణు చర్చల ప్రధాన ప్రతినిధిగా సేవలు అందించారు. అంతేకాదు ఇరాన్ విదేశీ విధానాలను రూపొందించడంలో ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడంలో లారిజానీ కీలక పాత్ర పోషించారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి కూడా ఈయన అత్యంత నమ్మకమైన, సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. లారిజానీ మరణం ఇరాన్‌కు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా, హమాస్ నేత ఇస్మాయిల్ హనియేలను ఇరాన్ కోల్పోయింది. దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.  

Also Read: TMC అభ్యర్థుల జాబితా విడుదల.. మళ్లీ దీదీ VS సువేందు అధికారి

Advertisment
తాజా కథనాలు