/rtv/media/media_files/2026/03/17/india-condemns-pakistan-airstrikes-on-kabul-hospital-2026-03-17-14-34-48.jpg)
India condemns Pakistan airstrikes on Kabul hospital
అఫ్గానిస్థాన్‌లో కాబుల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానికి దాడుల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన భారత్.. పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద, అమానుష చర్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాస్ వేళ ఇలాంటి దాడులు చేయడం దారుణం అంటూ మండిపడింది. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ''పాకిస్థాన్ చేసింది పిరికిపంద చర్య. ఆ దారుణాన్ని సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకునేందుకు పాక్ యత్నిస్తోంది. అఫ్గాన్ సార్వభౌమాధికారంపై దాడి జరిగింది.
ఇలాంటి దారుణ చర్యలు ప్రాంతీయ శాంతిభద్రతలకు ముప్పుగా ఉంటాయి. పాకిస్థాన్ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడి తమ అంతర్గత వైఫల్యాలు ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడి చేయడం అత్యంత దారుణం. ఈ చర్యలకు పాల్పడ్డ వాళ్లను అంతర్జాతీయ సమాజం జవాబుదారులుగా చేయాలి. పాక్ చేస్తున్నటువంటి ఇలాంటి ఉద్దేశపూర్వక దాడులు వెంటనే అడ్డుకోవాలని'' భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Also Read: మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం..మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష!
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అఫ్గాన్ ప్రజలకు అండగా ఉంటామని చెప్పింది ఈ దాడిలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా కాబుల్‌లోని ఓ ఆస్పత్రిలో డ్రగ్స్‌కు బానిసైన వాళ్లకి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి ఈ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ దుర్ఘటనలో 400 మంది చనిపోయినట్లు అఫ్గాన్ ప్రభుత్వం తెలిపింది.
This is not Iran, Lebanon, Israel
— Sumit (@SumitHansd) March 17, 2026
This is Kabul, Afganistan.
Pakistan airstrike on a drug rehab hospital in Kabul reportedly killed 200 patients and injured at least 170
Early reports: ~400 killed, 250+ injured
Fuck Pakistan 🇵🇰🖕#Afghanistan#airstrike#Taliban#hospitalpic.twitter.com/SppcRmKeLb
Follow Us