/rtv/media/media_files/2026/03/19/canada-2026-03-19-07-29-21.jpg)
Three India-Origin Persons Killed in Canada Amidst Hate Crime Fears
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. మార్చి 14న అల్బెర్టా ప్రావిన్స్‌లో బీరీందర్ సింగ్ (22) అనే యువకుడు వాహనంలోఉండగా కాల్పులకు గురై నృతి చెందాడు. మార్చి 13న తేదిన సాస్కాట్చెవాన్‌లో నార్త్ బ్యాటిల్ ఫోర్డ్‌లో దేవిందర్ సింగ్ (31) ప్రాణాలు కోల్పోయాడు. అదేరోజున ఫోర్ట్ సెయింట్ జాన్ వద్ద గొడవ జరగగా గుర్‌కిరీట్ మనోచా (31) అనే వ్యక్తి మృతి చెందాడు.
Also Read: ఫ్రీ గ్యాస్ కనెక్షన్ + ఫ్రీ సిలిండర్: కేవలం రూ.550కే రిఫిల్.. ఇలా అప్లై చేసుకుంటే చాలు..!
బీరిందర్ హత్యపై అతని స్నేహితుడు స్పందించాడు. ఆరోజు మధ్నాహ్నం కారులో బీరిందర్‌తో కలిసి ఉన్నానని.. అంతలోనే ఓ పికప్ కారు మా వద్ద ఆగిందని తెలిపాడు. అందులో ఉన్న వ్యక్తులు తమపై కాల్పులు జరిపినట్లు చెప్పాడు. స్టీరింగ్ వద్ద బీరిందర్‌కు బుల్లెట్ తగలడంతో అక్కడే మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది జాతి విద్వేష ఘటన అనుకుంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జనసంచారం అంతగా ఉండని ప్రదేశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరంటూ వాపోయాడు.
Also read: గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల దాడి..రంగంలోకి ఉక్రెయిన్ నిపుణులు
మరోవైపు దేవీందర్ సింగ్ హత్యపై విచారణ జరుగుతోంది. ఇక బ్రిటిష్ కొలంబియాకు చెందిన గుర్‌కిరీట్ సింగ్ మనోచా.. మేనేజ్‌మెంట్ డిగ్రీ చేసేందుకు ఫర్ట్ సెయింట్ జాన్‌కు వెళ్లాడు. ఏప్రిల్ 13న చార్లీలేక్ బోట్ క్యాంపు వద్ద రాత్రి 11 గంటలకు ఓ వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మనోచాకు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు వచ్చే సరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇతడి సొంతూరు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. అయితే మనోచ్‌కు గొడవ పడింది ఎవరూ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.
Follow Us