యుద్ధం ఆగడం కష్టమే.. పశ్చిమాసియాకు వెళ్తున్న వేలాది యూఎస్ బలగాలు

ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చివరి దశకు తీసుకెళ్లేందుకు ట్రంప్‌ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపునకు వేలాదిగా యూఎస్‌ బలగాలు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
US weighs military reinforcements as Iran war enters possible new phase

US weighs military reinforcements as Iran war enters possible new phase

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం లేదు. రోజురోజుకు యుద్ధ వాతావరణం ముదురుతూనే ఉంది. ఇప్పుడే పరిస్థితులు సద్ధుమణిగే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చివరి దశకు తీసుకెళ్లేందుకు ట్రంప్‌ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపునకు వేలాదిగా యూఎస్‌ బలగాలు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు చెప్పినట్లు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రాయిటర్స్‌ తన కథనంలో తెలిపింది.  

Also Read: అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు

రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమాసియాలో వేలాదిమంది సైన్యంతో తమ బలగాలను మోహరించాలని అమెరికా భావిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావీ దళాల ద్వారా హర్ముజ్ జలసంధి నుంచి చమురు ట్యాంకర్ల రవాణాకు రక్షణ కల్పించే అంశంపై ప్రభుత్వం చర్చలు జరిగాయని అమెరికా అధికారి తెలిపారు. ఇందులో భాగంగా ఇరాన్ తీర ప్రాంతంలో యూఎస్ సైన్యాన్ని మోహరించాల్సి రావొచ్చని తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకంగా ఉన్న ఖర్గ్‌ ఐలాండ్‌కు కూడా అమెరికా బలగాలను పంపించే అంశంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. 

కానీ అమెరికా చేపట్టబోయే ఈ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని ఓ అధికారి హెచ్చరించారు. ఈ ప్లాన్‌లపై చర్చలు జరిగాయని.. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మరోవైపు ఈ చర్చలకు సంబంధించి ఇంతవరకు పెంటగాన్ అధికారిక ప్రకటన చేయలేదు. 

Also Read: కెనడాలో దారుణం.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య

ఇదిలాఉండగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఇరాన్‌పై 7800లకు పైగా దాడులు జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 13 మంది అమెరికా సైనికులు మరణించారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు. 

Advertisment
తాజా కథనాలు