/rtv/media/media_files/2026/03/17/iran-2026-03-17-20-16-12.jpg)
Iran’s envoy in Moscow denies new supreme leader being treated in Russia
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయాలపాలైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు కూడా వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఖమేనీని ఆహ్వానించినట్లు కూడా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ వీటిపై స్పందించింది. ఖమేనీ రష్యాలో ఉన్నట్లు వచ్చిన వార్తలు తప్పుడు కథనాలని రష్యాలో ఉన్న ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ వెల్లడించారు.
Also Read: అమెరికా దాడి.. జర్రయితే మొజ్తాబా ఖమేనీ చచ్చిపోతుండే...
అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడులు చేసే ముందు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. రష్యా, వెనెజువెలాకు వెళ్లేందుకు యత్నించారని తప్పుడు వార్తలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు మొజ్తబా ఖమేనీ కూడా చికిత్స కోసం రష్యాకు వెళ్లినట్లు వార్తలు ఇస్తున్నారు. ఇదో కొత్త మానసిక యుద్ధం. మా ఇరాన్ నేతలు ఎక్కడికో పారిపోయి, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రజల మధ్యనే ఉంటారని'' కాజెమ్ జలాలీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ వ్యవహారంపై రష్యా అధికార ప్రతినిధి మాట్లాడేందుకు నిరాకరించారు.
Also Read: 90 మైళ్ల దూరం.. 60 ఏళ్ల వైరం.. క్యూబాపై ట్రంప్ కన్నేయడానికి కారణాలివే!
ఇదిలాఉండగా అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఇటీవల మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన యుద్ధం మొదలైనప్పటినుంచి ఎక్కడా కూడా బహిరంగంగా కనిపించలేదు. అయితే ఈ దాడుల్లో ఆయనకు తీవ్రంగా గాయాలైనట్లు అమెరికా తెలిపింది. ఆ తర్వాత ఆయన చికిత్స కోసం రష్యాకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రష్యాలోని ఇరాన్ రాయబారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఇవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేశారు.
Follow Us