Fuel Shortage: ఇంధన సంక్షోభం.. ఆ దేశంలో ఆగిపోయిన దహన సంస్కారాలు

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో హర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ ఇంధన సంక్షోభ ప్రభావం థాయ్‌లాండ్‌లో అంత్యక్రియలపై పడటం కలకలం రేపుతోంది. అక్కడ డీజిల్ లేక ఓ ప్రాంతంలో దహన సంస్కారాలను ఆపేశారు.

New Update
Temple crematorium in Nakhon Phanom shuts as fuel shortage disrupts funerals in Thailand

Temple crematorium in Nakhon Phanom shuts as fuel shortage disrupts funerals in Thailand

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో హర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ ఇంధన సంక్షోభ ప్రభావం థాయ్‌లాండ్‌లో అంత్యక్రియలపై పడటం కలకలం రేపుతోంది. అక్కడ డీజిల్ లేక ఓ ప్రాంతంలో దహన సంస్కారాలను ఆపేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే నఖోన్ ఫానోమ్‌ ప్రావిన్స్‌లో 'వాట్‌ మహాథాట్' అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ దహన సంస్కారాల కోసం ఆధునిక పొగరహిత దహన యంత్రాలు వినియోగిస్తారు. దీనికోసం భారీగా డీజిల్ కావాల్సి ఉంటుంది. ప్రతి దహన సంస్కారం కోసం దాదాపు 90 లీటర్ల డీజిల్ వాడుతారు. 

Also Read: మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం..మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష!

ప్రస్తుతం ఇంధన సంక్షోభం నెలకొనడంతో అక్కడి గ్యాస్‌ స్టేషన్‌లలో రూల్స్‌ కఠినతరం చేశారు. వ్యక్తిగత కొనుగోళ్లకు 500 బాట్‌లకే (థాయ్‌లాండ్ కరెన్సీ) లిమిట్ పెట్టారు. అలాగే డ్రమ్ములు, కంటైనర్లలో ఇంధనం నింపడం నిషేధించారు. దీంతో ఆలయ సిబ్బందికి డీజిల్ దొరకడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆలయ సిబ్బంది అంత్యక్రియల కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపేస్తున్నామని ప్రకటన చేశారు. 

కానీ ఇలా చేయడం వల్ల పేద కుటుంబాల దహన సంస్కారాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. కంటైనర్లలో ఇంధనం కొనేందుకు ఆలయాలకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంధన కొరత కొనసాగుతున్న నేపథ్యంలో థాయ్‌లాండ్‌లోని గ్యాస్‌ స్టేషన్లలో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు అంబులెన్స్ సర్వీసులు కూడా తగ్గిపోయాయని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Also Read: కాబుల్‌ ఆస్పత్రిపై దాడులు.. పాక్‌పై భారత్‌ తీవ్ర విమర్శలు

Advertisment
తాజా కథనాలు