Delhi Elections Results 2025 LIVE : మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో బీజేపీ | BJP vs AAP | Kejriwal | Modi
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన సేవ అందిస్తామన్నారు.
కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిషిపై గెలిచాక కేబినెట్ లో రమేష్ బిధూరికి కేబినెట్ లో హోమ్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న కేజ్రీవాల్.. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు.
ల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి ఓటమి దిశగా పయనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆమె కంటే 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ స్థానానికి 13 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కొనసాగుతోంది. అయితే ఒకప్పుడు నాలుగు సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఒక స్థానం కూడా గెలవడంలేదు. అమలు చేయలేని హామీలు, ప్రచారం చేయకపోవడం వంటివి కాంగ్రెస్ పతనానికి కారణాలని చెప్పవచ్చు.
ఢిల్లీలో ఆప్ కు దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ దారుణంగా చీల్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15 శాతం ఓట్లు కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4 శాతం ఓట్లు రాగా ఇప్పుడు ఓటింగ్ షేర్ 17 శాతానికి పెరిగింది.
కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి వెనుకంజలో ఉండగా బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ముందంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా 600 ఓట్లతో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిదూరి వార్తల్లో నిలిచారు.