/rtv/media/media_files/2025/02/08/q20kCbQC1Mi7zpeukkN4.jpg)
aap vs congress
Delhi Election Counting:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుంది. నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన ఆప్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు అందరూ వెనుకంజలో ఉన్నారు. వాస్తవానికి ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ దారుణంగా చీల్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15 శాతం ఓట్లు కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4 శాతం ఓట్లు రాగా ఇప్పుడు ఏకంగా ఓటింగ్ షేర్ 17 శాతానికి పెరిగింది. ఆప్ కు దక్కా్ల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయిందని చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్ , కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి.