Delhi Election Results 2025: ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి

ల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి ఓటమి దిశగా పయనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆమె కంటే 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  న్యూఢిల్లీ స్థానానికి 13 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.

New Update
ramesh bidhuri

ramesh bidhuri

Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.  బీజేపీ(BJP) 40 స్థానాల్లో, ఆప్(AAP) 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. ఆప్ అగ్రనేతలు ఇప్పటి వరకు ముందంజలో ఉండగా..  ఇప్పుడు మళ్లీ వెనుకంజలో వెళ్లారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి ఓటమి దిశగా పయనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆమె కంటే 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  న్యూఢిల్లీ స్థానానికి 13 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 300 ఓట్ల వెనుకబడి ఉన్నారు. జంగ్‌పురా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వాపై మనీష్  సిసోడియా ముందంజలో ఉన్నారు.

Also Read:🔴Delhi Elections Live Updates: పుంజుకున్న AAP.. కౌంటింగ్ లో బిగ్ ట్విస్ట్!

Also Read: Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే !

 

వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిదూరి వార్తల్లో 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో  రమేష్ బిదూరి వార్తల్లో నిలిచారు.  ఎంపీ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా రోడ్లను మారుస్తానని.. సీఎం అతిషి తన ఇంటి పేరు మార్చుకుందంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అతిషి ఎప్పుడూ ప్రజలను కలవడానికి రాలేదని ..  ఎన్నికలు వచ్చినప్పుడు, ఆమె ఢిల్లీ వీధుల్లో అడవిలో జింక పరిగెత్తినట్లుగా తిరుగుతోందంటూ  కామెంట్స్ పై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఒకనొక సమయంలో  రమేష్ బిదూరిని తప్పించి మరోకరికి బీజేపీ టికెట్ ఇస్తుందంటూ ప్రచారం కూడా నడించింది.  కానీ కౌంటింగ్ లో మాత్రం రమేష్ బిదూరి సీఎం అతిషిని వెనక్కి నెట్టి ముందంజలో  కొనసాగుతున్నారు.  

Also Read: Delhi Election Results 2025: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

Also Read: ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు