/rtv/media/media_files/2025/02/08/6tga5ywGpbriLLWEwR4d.jpg)
aap aravind
Delhi Elections 2025: వెలువడుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌లను పరిశీలిస్తే బీజేపీ స్పష్టమైన మెజారిటీ(BJP in Majority)ని సాధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2013, 2015 , 2020 ఎన్నికలలో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వెనుకబడినట్లు కనిపిస్తోంది. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఈ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి.
Also Read:🔴Delhi Elections Live Updates: పుంజుకున్న AAP.. కౌంటింగ్ లో బిగ్ ట్విస్ట్!
క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 2012లో జన్ లోక్‌పాల్ కోసం అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంతో పాటుగా అతని నివాసానికి సంబంధించిన షీష్‌మహల్ ఎపిసోడ్ ఆప్, కేజ్రీవాల్ నిజాయితీ ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. జైలుకు వెళ్లిన సరే రాజీనామా చేయకూడా పట్టుదలగా కేజ్రీవాల్ ఉండటం.. పాలన పక్కదారి పట్టడం ఇంకో మైనస్ గా చెప్పుకోవచ్చు. ఆప్ తన ప్రజల సమస్యలను పక్కనపెట్టి, అధికార రాజకీయాల్లో మాత్రమే పాల్గొంటుందనే భావన కూడా ప్రజల్లో ఏర్పడింది.
Also Read: Delhi Election Results 2025: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఆప్ బలమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఉచితాలను పంపిణీ చేస్తామని ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ, ఆప్ పట్ల ప్రజల నుండి అసంతృప్తి పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు, అనేక ఇతర అంశాలను హామీల ప్రకటనల ద్వారా ఆప్ తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంది. అయితే ఈసారి బీజేపీ దీనిని అర్థం చేసుకుని సరిగ్గా అలాంటి హామీలతో కూడిన మ్యానిఫెస్టోను ప్రకటించి జనాల్లోకి వెళ్లింది.
Also Read: Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే !
ఆప్ పతనానికి కారణాలివే!
ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కూడా ఆప్(AAP) ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)తో పొత్తు పెట్టుకోవడానికి ఆప్ నిరాకరించడం ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఆప్, కాంగ్రెస్ రెండింటి ఓటు బ్యాంకు దాదాపుగా ఒకేలా ఉంటుంది. దీంతో ఓటు షేరింగ్ వీడిపోవడం బీజేపీ(BJP)కి ప్లస్ గా మారింది. రెండవది ఎంఐఎం ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో పోటీ చేసి ఆప్ ఓటు బ్యాంకుకు అడ్డుకట్టవేసింది.
నాలుగోసారి అధికారంలోకి రావడానికి ఆప్ ఈ సారి అనేక మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లను నిరాకరించింది. దీంతో ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీకి చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడి బీజేపీకి మద్దతు ప్రకటించారు.
Also Read: ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి