/rtv/media/media_files/2025/02/02/oSoHDiuXoiAcVf4Q1bn5.jpg)
Congress
Delhi Election 2025 Results: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హోరాహోరీగా జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ప్రకారమే బీజేపీ లీడింగ్(BJP Leading)లో ఉంది. ఇవే కనుక నిజమైతే ఈసారి దేశ రాజధానిలో ఆప్(AAP)కి ఘోర పరాజయం తప్పదు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ(Congress)కి సున్నా సీట్లు హ్యాట్రిక్ వస్తుందని అంచనా వేశాయి. 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు గెలిచింది. ఇప్పుడు కనీసం ఖాతా కూడా తెరవడం లేదు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానం మాత్రమే సాధించింది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి అసలు కారణం ఏంటనే విషయంపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
ఆప్ పాలన
గతంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు గెలిచింది. అప్పుడు పార్టీ చేసిన ఘనత తప్ప ఇంకేమి లేదు. ఆప్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయాలు అన్ని కూడా మట్టిలో కలిసిపోయాయి. దివంగత షీలా దీక్షిత్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 15 ఏళ్లు పాలించింది. ఆమె నాయకత్వాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని కాంగ్రెస్ భావించింది. కానీ ఆప్ పార్టీ వచ్చి అన్నింటిని కూడా తలకిందులు చేసింది.
ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
పార్టీ హామీలు
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.2500 నగదు సాయంతో పాటు రూ.25 లక్షల ఆరోగ్య బీమా సేవలను అందిస్తామని తెలిపింది. వీటితో పాటు కొన్ని అమలు కాని హమీలను ఇవ్వడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణాలే. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చి హామీలు అమలు చేయలేకపోవడం కూడా కాంగ్రెస్ పతనానికి కారణం అని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
అగ్రనేతలు ప్రచారం చేయకపోవడం
ఢిల్లీలో అగ్రనేతలు పూర్తిగా ప్రచారం చేయకపోవడం కూడా కాంగ్రెస్ పతనానికి ఓ కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేసేవారు. ఇది కూడా ఓ కారణమే.