ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?
భద్రాది కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం సీఐ ఏసీబీకి దొరికి 10 రోజుల్లోనే మరో సీఐ రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. భూవివాదంలో సెటిల్మెంట్ చేసికి సీఐ సతీష్ కుమార్ డీల్ కుదుర్చుకున్నాడు. అతని అనుచరుడు జర్నలిస్ట్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
Bribe: డెత్ సర్టిఫికేట్ కోసం రూ.90 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన VRO, తహశీల్దార్
ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి భార్య ఇటీవల మృతి చెందింది.అతడు డెత్ సర్టిఫికేట్ కోసం వీఆర్వో వద్దకు వెళ్లగా అతడు రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకి రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వీఆర్వో, తహశీల్దార్‌ను అరెస్టు చేశారు.
Bhadrachalam: ఫోన్ పేలో లంచం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన CI
భద్రచలం సీఐ రమేష్ లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రావెల్స్ తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటే రూ.30వేలు డిమాండ్ చేశాడు. రూ.20వేలు బేరం కుదుర్చుకున్నాడు. బాధితుడి దగ్గర నుంచి గన్‌మెన్‌కు ఫోన్ పే చేయించుకున్నాడు. అలా CI రమేష్ ACBకి చిక్కాడు.
AP SI: పవన్ ఇలాకాలో లంచాల దందా.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన SI
ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.
Bribery Case: పైకం లేకపోతే ఫైల్ కదలదు.. అడ్డంగా బుక్కైన లంచగొండి ఆఫీసర్లు!
తెలంగాణలో మరో ముగ్గురు లంచగొండి ఆఫీసర్ల బాగోతం బయటపడింది. జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భూమి సర్వే, వెంచర్ పర్మిషన్, ట్రాన్స్ఫార్మర్ పనులకోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
TGSPDCL: లంచం అడిగితే మాకు చెప్పండి.. TGSPDCL కీలక ప్రకటన
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది, అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. 040 - 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
Uttar Pradesh: లంచంగా ఐదు కేజీల బంగాళాదుంపలు.. ఎస్సై సస్పెన్షన్.. ట్విస్ట్ ఏమిటంటే..
కన్నౌజ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఓ రైతు కేసును సెటిల్ చేసేందుకు ఆయన వద్ద నుంచి బంగాళదుంపల్ని లంచంగా డిమాండ్ చేశాడు.ఈ విషయాన్ని రైతు ఫోన్ కాల్ రికార్డు చేయడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దీంతో ఆ ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు.
Bribe: లంచగొండి పోలీస్.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్!
అమీన్పూర్ సీఐగా పనిచేసి, ప్రస్తుతం సంగారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న సాయివెంకట కిశోర్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కేసు విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిగౌడ్ దగ్గర కోటిన్నర డిమాండ్ చేయగా.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
/rtv/media/media_files/2026/01/30/lokayukta-police-2026-01-30-17-01-04.jpg)
/rtv/media/media_files/2025/04/21/0H37zPVcqo8B5llnN3o4.jpg)
/rtv/media/media_files/2025/04/17/F19JwSWlJIm7StJQZS2X.jpg)
/rtv/media/media_files/2025/04/10/ZVMWwScXWleETi3MKC0Y.jpeg)
/rtv/media/media_files/2025/03/25/osTYmGyz8LK8uGmSTe41.jpg)
/rtv/media/media_files/2025/02/15/grH7eoHABk1dMZmRdKby.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-22-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/potatoes.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-56-4.jpg)