AP SI: పవన్ ఇలాకాలో లంచాల దందా.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన SI

ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై  గుణశేఖర్ రూ.20 వేలు  తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.

New Update
si bribe

Pithapuram Rural SI Gunasekhar caught by ACB

AP SI: ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై  గుణశేఖర్ రూ. 20 వేలు  తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.  దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.

పక్కా సమాచారంతో రైడ్స్.. 

దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా అవినీతి నిరోధక శాఖ డి.ఎస్.పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రైడ్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ ,అతని పర్సనల్ డ్రైవర్ లను పట్టుబడ్డారు. ఈ సంఘటనపై  సంఘటన స్థలానికి చెరుకుని శాఖపరమైన విచారణ చేపట్టినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జిల్లాలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే మంటలను అదుపు చేశారు.  అయితే ఎంత వరకు నష్టం జరిగింది? ఎలా అగ్ని ప్రమాదం సంభవించిదనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాద సమయంలో శీతల గిడ్డంగిలో సుమారు రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

bribe | pitapuram | telugu-news | today telugu news acb 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment