/rtv/media/media_files/2026/02/21/bjp-mla-2026-02-21-19-05-09.jpg)
కర్ణాటక(karnataka) లో ఓ ఎమ్మెల్యే(bjp-mla) లంచం(bribe) తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. దాదాపు రూ. 11 లక్షల డీల్‌లో భాగంగా ఈ మొదటి వాయిదా డబ్బులు తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు.
Also Read : పిల్లలపై లైంగిక వేధింపులు.. అవిముక్తేశ్వరానంద స్వామిపై ఎఫ్ఐఆర్ కు ఆదేశాలు
అసలు విషయం ఏమిటంటే..
గడగ్ జిల్లాలో ఒక రోడ్డు పక్కన గోడ కట్టే పనిని విజయ్ పూజార్ అనే కాంట్రాక్టర్ తీసుకున్నారు. ఆ పనికి సంబంధించిన పర్మిషన్లు ఇప్పించాలంటే తనకు రూ. 11 లక్షలు ఇచ్చుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారట. దీంతో విసిగిపోయిన ఆ కాంట్రాక్టర్ లోకాయుక్త పోలీసులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు నిఘా పెట్టి, ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి పట్టుకున్నారు. - arrest
ఎమ్మెల్యేతో పాటు ఆయనకు ఈ పనిలో సాయం చేసిన ఇద్దరు పీఏలు మంజునాథ్, గురునాయక్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురిని లోకాయుక్త కార్యాలయంలో విచారిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా వదిలేది లేదన్నారు. గడగ్ జిల్లాలోని చిన్న నీటిపారుదల శాఖ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను సులభతరం చేయడానికి లంచం కోరినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.
Also Read : సంచలనాల ది కేరళ స్టోరీ-2.. అసలు ఆ సినిమాలో ఏముంది?
Follow Us