Yashasvi Jaiswal : టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. జైస్వాల్ తన 106వ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.

New Update
Yashasvi-Jaiswal

టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.ఐపీఎల్‌లో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో  జరిగిన మ్యాచ్ తో జైస్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.  జైస్వాల్ తన 106వ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. ఈ లిస్టులో హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ(90 ఇన్నింగ్స్ లలో ) టాప్ లో ఉన్నాడు.  ఇక తరువాతి స్థానాల్లో రుతురాజ్ (91), కేఎల్ రాహుల్ (39), గిల్ (103) ఇన్నింగ్స్ లతో కొనసాగుతున్నారు.  

Also Read :  భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి చేసిన భర్త!

Also Read :  KKR Vs RR: రియాన్ పరాగ్ మళ్లీ ఫెయిల్.. గెలుపు దిశగా కోల్‌కతా!

టీం ఇండియా తరపున 23 టీ20 లలో

యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు టీ20ల్లో మూడు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 పరుగులలో 1,600 కంటే ఎక్కువ ఐపీఎల్ లోనే వచ్చాయి.  టీం ఇండియా తరపున 23 టీ20 లలో 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. 2020 ఐపీఎల్  వేలంలో జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన తొలి సీజన్‌లో కేవలం మూడు ఆటలు మాత్రమే ఆడి 40 పరుగులు చేయగలిగాడు. 

తరువాతి రెండు ఎడిషన్లలో 10 మ్యాచ్‌లు ఆడాడు. 2023 ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 163.61 సగటుతో 625 పరుగులు చేసింది. గత సీజన్‌లో అతను 155.91 స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 1,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లలో జైస్వాల్ ఒకరు. సామ్సన్, జోస్ బట్లర్ , అజింక్య రహానే, షేన్ వాట్సన్‌ల సరసన చేరాడు.

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో  కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్151 పరుగులు చేసింది. ఛేదనలో డికాక్ (97*) రఘువనీ (22*)తో కలిసి ఆడుతూ పాడుతూ కేకేఆర్ ను విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్ తో  కేకేఆర్ కు ఇది తొలి విజయం కాగా  రాజస్థాన్ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి.

Also read :  అరె అచ్చం విరాట్ లాగే ఉన్నాడే.. ఎవరీ తుర్కియే కోహ్లీ!

Also Read :  తాహనజర్ హత్యకు అదే కారణమా? పోలీసుల విచారణలో సంచలనాలు!

 

ipl-2025 | rajasthan-royals | yashasvi-jaiswal | telugu-cricket-news | telugu-sports-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు