VK: నా జేబులో సాండ్ పేపర్ లేదు..ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు విరాట్ కౌంటర్

ఆస్ట్రేలియా ఫ్యాన్‌కు కౌంటర్ ఇవ్వడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్లకు, కోహ్లీకి వార్ జరుగుతూనే ఉంది. తాజాగా ఈరోజు మ్యాచ్‌లో ఆసీస్ ఫ్యాన్స్‌కు సూపర్ కౌంటర్ ఇచ్చాడు విరాట్. 

New Update
india

Virat Kohli

విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు బయట కూడా మాంచి హుషారుగా ఉంటాడు. గ్రౌండ్‌లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తాడు, రకరకాల గెస్చర్స్ చేస్తూ అందరినీ కవ్విస్తూ ఉంటాడు. అలాగే ఎవరైనా తనను టార్గెట్ చేస్తే వాళ్ళకు కౌంటర్లు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఇస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్ల చూపు విరాట్ కోహ్లీ మీదనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు అక్కడి మీడియా, ఫ్యాన్స్ అందరూ కోహ్లీ మీద దాడి చేస్తున్నారు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కూడా ఆసీస్ అభిమానులు అతనిని ఎగతాళి చేశారు. వెళ్ళిపోతున్న విరాట్ వెనక్కు వచ్చి వారి మీద సీరియస్ అయ్యాడు. ఇప్పుడు జరుగుతున్న ఐదవ టెస్ట్‌లో కూడా ఆసీస్ పీపుల్ కోహ్లీతో పాటూ మిగతా భారత ఆటగాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. వారికి విరాట్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. 

 అసలేమైందంటే...

సినీ టెస్ట్‌కు బుమ్రా కెప్టెన్. అయితే నిన్న ఆట మధ్యలో అతను మైదానం నుంచి వెళ్ళిపోయాడు.  దీనికి ఆసీస్ ఫ్యాన్స్ బుమ్రా షూలో సాండ్ పేపర్ ఉందంటూ వీడియోలు షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేయాలని కామెంట్లు చేశారు. గాయం కారణంగా ఈరోజు కూడా బుమ్రా మ్యాచ్‌ ఆడటానికి రాలేదు. దీంతో ఆసీస్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోయారు. ఆట అవుతున్నా వారు అరుస్తూనే ఉన్నారు. కరెక్ట్‌గా ఇదే సమయంలో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరెస్ట్ అయ్యాడు. అప్పుడు విరాట్ వారి ఫ్యాన్స్‌ను చూస్తూ తన జేబుల్లో చేతులు పెట్టి..నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి అంటూ సైగలు చేశాడు.  స్టీవ్ స్మిత్ సాండ్ పేసర్ స్కాం లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఆస్ట్రేలియన్లు బుమ్రా షూలో సాండ్ పేపర్ ఉందని కామెంట్ చేశారు. అందుకే విరాట్ ఆ దగ్గర సాండ్ పేపర్ లేదని సైగ చేసి చూపించాడు. 

భారత ఫ్యాన్స్ ఖుషీ...

విరాట్ చేసిన పనికి భారత అభిమానులు సంతోషడుతున్నారు. విరాట్ చాలా మంచి కౌంటర్ ఇచ్చాడని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తమ టీమ్ ఆటగాళ్ళు ఆసీస్ ఆటగాళ్ళల్లా మోసం చేయరంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 

Also Read: USA: అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ నేతలు ప్రమాణ స్వీకారం

   

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...ఢిల్లీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  

New Update
ipl 2025

DC VS LSG

లక్నో సూపర్ జెయింట్స్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  అభిషేక్‌ పోరెల్‌  36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లతో 51 పరుగులు, కేఎల్‌ రాహుల్‌  42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు, అక్షర్‌ పటేల్‌  24 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లు 34 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలిచేశారు. ఢల్లీ బ్యాటర్లను సూపర్ జెయింట్స్ బౌలర్లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు.  లక్నో బౌలర్లలో మార్‌క్రమ్‌ రెండు వికెట్లు తీశాడు.

రాణించిన మార్ క్రమ్, మిచెల్ మార్ష్..

లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐదెన్ మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (14) పరుగులు చేశాడు.ఆయుష్ బదోని (36) దూకుడుగా ఆడాడు. 9.5 ఓవర్లకు 87/0తో పటిష్టస్థితిలో లక్నో .. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఊహించిన దానికన్నా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 4, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర ఒక్కో వికెట్ పడగొట్టారు.

today-latest-news-in-telugu | IPL 2025 | lsg | dc | match 

Also Read:  BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment