Cricket: ఇదేం మర్యాద...కోహ్లీని అవమానించిన ఆసీస్ అభిమానులు

ఒకవైపు మీడియా, మరోవైపు ఆసీస్ అభిమానులు వరుసపెట్టి విరాట్ ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈరోజు మళ్ళీ విరాట్ కోహ్లీ ని ఆసీస్‌ అభిమానులు అవమానించారు. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

author-image
By Manogna alamuru
New Update
ausis

Virat Kohli

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే నాలుగో టెస్ట్‌లో విరాట్ చాలా ఏకాగ్రతగా ఆడాడు. ముందు టెస్ట్‌లలో చేసిన తప్పును రిపీట్ చేయకుండా...వికెట్ పోగొట్టుకోకుండా చాలాసేపు ఆడాడు. కోహ్లీ 8 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అయితే మొదట్లో ఆఫ్‌సైడ్‌ బంతులను వదిలేసి క్రమశిక్షణ పాటించినట్లు కనిపించగా.. చివరకు అదే బంతికి అవుట్ అయి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. బోలాండ్‌ వేసిన ఆఫ్‌ సైడ్‌ బంతిని కదిలించి వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి కోహ్లీ మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జయస్వాల్ రనౌట్ అవ్వగానే విరాట్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 

స్టార్ బ్యాటర్‌‌ను ఇలా అవమానించడం తగదు..

అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు వెళుతున్న విరాట్‌ను ఆసీస్ అభిమానులు ఎగతాళి చేశారు. కావాలని అతనిని మాటలతో, చేతలతో రెచ్చగొట్టారు. ఆసీస్‌ అభిమానుల కామెంట్స్‌తో కోహ్లీకి  కోపాన్ని తెప్పించాయి. దీంతో లోపలికి వెళుతున్న అతను వెనక్కి తిరిగి వచ్చి వారిపైపు సీరియస్‌గా చూశాడు. దీన్ని గమనించిన భద్రతా అధికారి కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఆసీస్ అభిమానులు, మీడియా ఇలా వరుసపెట్టి విరాట్‌ను అవమానించడం సరికాదంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి తోడు నిన్న క్రీజ్‌లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర, కోహ్లీకి మధ్య చిన్న వాగ్వాదం అయింది. దీన్ని కూడా ఆసీస్ అభిమానులు సహించలేకపోతున్నారు. అందుకే కావాలని విరాట్‌ను రెచ్చగొట్టే మాటలు అంటున్నారు. 

మరోవైపు విరాట్ కోహ్లికి భారతదేశంలో అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ పట్ల ఆసీస్‌ అభిమానులు ప్రవర్తించిన తీరును భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌ ఖండించారు. దేశంలోని అత్యుత్తమ బ్యాటర్‌ పట్ల ఇంత అమర్యాదకరంగా ప్రవర్తించడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ఎక్స్‌ ఫ్లాట్‌ ఫామ్‌లో పోస్ట్ పెట్టారు. ఆటగాళ్లపై విమర్శలు చేయొచ్చు కానీ.. అది హద్దులు దాటుతోందని సంజనా అన్నారు.

 

ఇక నాలుగో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 164/5 స్కోరుతో ఉంది. రిషభ్ పంత్ 6 పరుగులతో, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది.  టీమ్‌ఇండియా ఇంకా 310 పరుగుల వెనకంజలో ఉంది. ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి.

Also Read: HYD: మాదాపూర్‌‌లో రోడ్డు ప్రమాదం..డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు.

New Update
KKR Vs PBKS sports

KKR Vs PBKS sports

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్‌ ఆర్య, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్‌ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆ తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (69) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్‌ సింగ్‌ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) ఔట్‌ అయ్యాడు. అలా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ ఔట్, శ్రేయస్‌ అయ్యర్‌ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment