/rtv/media/media_files/2025/02/24/tgzzPBNBsI7qzsFSWKgp.jpg)
team India victory Pakistan people breaking TV video viral
IND vs PAK Viral Video: ఛాంపియన్ ట్రోఫీ 2025(Champion Trophy 2025)లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. దీంతో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో పాక్ దేశ ప్రజలు తీవ్ర కోపంగా కనిపిస్తున్నారు. తమదేశ జట్టు భారతదేశాన్ని ఓడిస్తుందని వారు చాలా ఆశలు పెట్టుకున్నారు.. కానీ వారి ఆశలు నిరాశ అయ్యాయి. దీంతో కోపంతో రగిలిపోతున్నాట్లు తెలుస్తోంది.
కోహ్లీ అదరగొట్టేశాడు
ఈ క్రమంలోనే ఓ పాకిస్థానీ యూట్యూబర్ షోయబ్ చౌదరి చాలా మందితో మాట్లాడి వారి రియాక్షన్ తెలుసుకున్నారు. ఆ సమయంలో ఒక పాకిస్తానీ వ్యక్తి తన జట్టు ఆటతీరుపై చాలా మనస్తాపం చెందాడు. అయితే, విరాట్ కోహ్లీ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను కూడా ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టును కింగ్ కోహ్లీ దుబాయ్‌లో ఓ రేంజ్‌లో ఆడుకున్నాడని ఆయన అన్నారు. అతను ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
టీవీని నేలకేసి కొట్టి
ఇక షోయబ్ చౌదరి ఇంటర్వ్యూ సమయంలో చాలా మంది పాకిస్తాన్ పౌరులు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో ఓ వ్యక్తి తమ జట్టు ఓటమిపాలవడంతో తన షాప్‌లో ఉన్న టీవీని బయటకు తెచ్చి రోడ్డుకు విసిరికొట్టాడు. అయితే ఇలా చేయకుండా షోయబ్ చౌదరి ప్రజలను ఆపినప్పటికీ.. ఆయన మాట ఎవరూ వినలేదు. ఆ టీవీని ముక్కలు ముక్కలుగా కొట్టి విరిసేశారు. ఈ మేరకు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇది ప్రతి పాకిస్తానీ వ్యక్తి బాధ అని.. దీనిని మరచిపోలేమని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
A Couple Spotted With The No.18 Virat Jersey In Pakistani Colours! ❤️ pic.twitter.com/ccfmZAwDJX
— Nikhil (@TheCric8Boy) February 23, 2025
Also Read: IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం