/rtv/media/media_files/2025/02/12/ZIka8US0rUn7lJt9cLtA.jpg)
team india opener shubman gill breaks hashim rohit sharma and amla record
భారత్ - ఇంగ్లండ్ (India-England) మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా (Team India) సొంతం చేసుకుంది. 3-0 తేడాతో ఈ సిరీస్‌ను దక్కించుకుంది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. సెంచరీతో అబ్బురపరిచాడు.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి మ్యాచ్‌లో 87 పరుగులు, రెండో మ్యాచ్‌లో 60 పరుగులు చేసిన ఈ స్టార్ బ్యాటర్ ఇవాళ జరిగిన మూడో మ్యాచ్‌లో 112 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో గిల్ అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశాడు.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
గిల్ అద్భుతమైన రికార్డు
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనతను అతడు కేవలం 50 ఇన్నింగ్స్‌లలో చేయడం విశేషం. దీనికంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. అతడు 53 ఇన్నింగ్‌లలో ఈ ఘనత సాధించాడు.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
అది మాత్రమే కాకుండా ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. శ్రేయస్ పేరిట 59 ఇన్నింగ్‌లలో ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు గిల్ కేవలం 50 ఇన్నింగ్‌లలో ఆ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
రోహిత్‌ను వెనక్కి నెట్టి మరో రికార్డు
Babar Azam is still at no 1 position in icc odi ranking #BabarAzam #PakistanCricket pic.twitter.com/hWHEwF5u9k
— ЅᏦᎽ (@13hamdard) February 12, 2025
దీంతోపాటు గిల్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే ఆరంభానికి ముందు ఐసీసీ వన్డే ర్యాగింగ్స్ ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ (Rohit Sharma) (773 పాయింట్లు)ను వెనక్కి నెట్టేసి.. (781 పాయింట్ల)తో గిల్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (786 పాయింట్లు)తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ పట్టికలో విరాట్ కోహ్లి 6 స్థానంలోకి పడిపోయాడు.