/rtv/media/media_files/2025/01/14/QcCZNY5SNbO5poawbLc9.jpg)
bcci Photograph: (bcci )
ఈ ఏడాది భారత్ లోనే ఎక్కువ మ్యాచ్ లు ఆడనుంది టీమ్ ఇండియా క్రికెట్ జట్టు. విదేశీ జట్లే ఇక్కడకు రానున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉన్న ఆటగాళ్ళు...దీని తర్వాత కొంత విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తరువాత నుంచి ఈ ఏడాదంతా వరుసగా సీరీస్ లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఏడాది చివరి వరకూ ఇక్కడే స్వదేశంలోనే సీరీస్ లు ఆడనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్ - డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇందులో ఒక మ్యాచ్ విశాఖలో కూడా జరగనుంది. దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఒక వన్డే మ్యాచ్ వైజాగ్ లో ఆడనుంది. 2003 తర్వాత భారత జట్టు మళ్ళీ ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది.
Also Read : తెలంగాణకు గుడ్ న్యూస్...మరో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్
తొలి టెస్టు - అక్టోబర్ 2 - 6 (అహ్మదాబాద్)
రెండో టెస్టు - అక్టోబర్ 10 - 14 (కోల్‌కతా)
సౌతాఫ్రికాతో సిరీస్‌ల వివరాలు
తొలి టెస్టు - నవంబర్ 14-18 (దిల్లీ)
రెండో టెస్టు - నవంబర్ 22-26 (గువాహటి)
Also Read : హైదరాబాద్‌లోనే ప్రవీణ్‌ను చంపేశారు.. కేఏ పాల్ సంచలన వీడియో!
వన్డే వివరాలు..
తొలి వన్డే - నవంబర్ 30 (రాంచీ)
రెండో వన్డే - డిసెంబర్ 3 (రాయ్‌పూర్)
మూడో వన్డే - డిసెంబర్ 6 (విశాఖపట్నం)
Also Read : ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు
టీ 20..
తొలి టీ20 - డిసెంబరు 9 (కటక్)
రెండో టీ20 - డిసెంబరు 11 (ఛండీగడ్)
మూడో టీ20 - డిసెంబరు 14 (ధర్మశాల)
నాలుగో టీ20 - డిసెంబరు 17 (లఖ్‌నవూ)
ఐదో టీ20 - డిసెంబరు 19 (అహ్మదాబాద్)
ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!
schedule | team-india | bcci | today-latest-news-in-telugu | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news