Ponting: ద్రవిడ్‌లా వారిద్దరికీ చెప్పలేను.. రో-కోపై పాంటింగ్‌ షాకింగ్ కామెంట్స్!

భారత క్రికెటర్లతో సన్నిహిత్యంపై రికీ పాంటింగ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ద్రవిడ్‌ కెరీర్ స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు తాను అండగా నిలిచానన్నాడు. ఇప్పుడు టెస్టుల్లో ఇబ్బంది పడుతున్న 'రో-కో'కు తానేమి చెప్పలేనని, వారిద్దరూ బెస్ట్ క్రికెటర్లే అన్నాడు. 

New Update
ponting

ponting Photograph: (ponting)

Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ భారత క్రికెటర్లతో సన్నిహిత్యంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియాతో ఆడిన పలు సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ద్రవిడ్ టెస్టు కెరీర్ సందిగ్ధంలో ఉన్నప్పుడు తాను బాసటగా నిలిచానని చెప్పాడు. ఇప్పుడు అదే గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న కోహ్లీ, రోహిత్ లకు మాత్రం తాను ఎలాంటి సూచనలు ఇవ్వలేకపోతున్నానన్నారు.  

మైదానంలోనే పోటీదారులం..

ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన పాంటింగ్.. 2007/08 సమయంలో రాహుల్ ద్రవిడ్ టెస్టు కెరీర్‌ ముగింపు దశకు చేరుకుంది. 4 టెస్టుల్లో 33.85 సగటుతో 237 పరుగులు చేశాడు. ఆ సమయంలోచాలా ఒత్తిడికి లోనయ్యాడు. చాలా పోరాటం చేసిన అనుకున్న రిజల్ట్ దక్కలేదు. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు గడ్డుకాలం ఎదురైంది. మేమిద్దరం మైదానంలోనే పోటీదారులం. కానీ బయటకాదు. ఇద్దరం 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేసేవాళ్లం. అయితో ఓసారి ద్రవిడ్ ను కలిసి ప్రశాంతంగా డిస్కస్ చేశాను. 'బయట ఏం మాట్లాడుకుంటున్నారో నీవు మరిచిపో. మరింత నమ్మకం పెట్టుకొని ముందుకెళ్లు. నువ్వొక అద్భుతమైన ప్లేయర్‌. ఆటపైనే దృష్టిపెట్టు. చిన్న చిన్న విషయాలను వదిలేయ్. గొప్పగా కెరీర్‌ను ముగిస్తావు’ అంటూ ద్రవిడ్ లో ఉత్తేజం నింపానని గుర్తు చేసుకున్నాడు. 

ఇది కూడా చదవండి: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది

అయితే ఇటీవల విరాట్ కోహ్లీ కూడా తడబడుతున్నాడు. కోహ్లీ అత్యున్నత క్రికెటర్. రోహిత్ కూడా అంతే. వీరిద్దరికీ టెస్టు క్రికెట్‌ క్లిష్టంగా మారింది. విరాట్, రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బెస్ట్‌ ప్లేయర్స్. అందుకే ద్రవిడ్‌కు ఇచ్చిన సలహాలు రోహిత్, కోహ్లీకి ఇవ్వలేను. వారిద్దరూ మరికొంత కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు పాటింగ్. 

ఇది కూడా చదవండి: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్‌!

\

ricky-ponting | rahul-dravid | kohli | rohit | today telugu news 

Advertisment
Advertisment
Advertisment