Rishabh Pant: ధోనీ చెప్పినట్లే చేశా.. ఉప్పల్‌ విజయ రహస్యం బయటపెట్టిన పంత్!

SRHపై సాధించిన విజయంపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో తన మెంటార్ ధోనీ నుంచి నేర్చుకుని, ఇక్కడ అప్లై చేశానని చెప్పాడు. ఓటమితో కుంగిపోవడం, విజయంతో పొంగిపోవద్దని ధోనీని చూని నేర్చుకున్నానన్నాడు.

author-image
By srinivas
New Update
pant dhoni

Pant interesting comments on Lucknow win

Rishabh Pant: ఐపీఎల్ 2025 సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో దారుణంగా ఓడిన లఖ్ నవూ.. ఉప్పల్‌ మైదానం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. అయితే ఈ విజయంతో లఖ్ నవూ ఓనర్ గొయెంకా,  కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందంలో మునిగితేలారు. అయితే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రిషబ్.. మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో ధోనీ నుంచి నేర్చుకుని, అదే ఇక్కడ అప్లై చేశానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

ధోనీ నుంచి నేర్చుకున్నా..

‘ఈ విజయం మాకు ఊరట కలిగించింది. మేము టీమ్‌ వర్క్‌ పైనే ఫోకస్ చేశాం. అయితే గెలిచినపుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండాలనేది  నా మెంటార్ ధోనీ నుంచి నేర్చుకున్నా. ఎప్పుడైనా మన కంట్రోల్‌లో ఉన్న వాటిపైనే దృష్టిపెట్టాలి. యంగ్ బౌలర్ ప్రిన్స్‌, సీనియర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పూరన్‌ను ఇంకాస్త స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలనుకున్నాం. ఏది ఏమైనా ఇప్పటికింకా మేము ఈ టోర్నీలో అత్యుత్తమ క్రికెట్ ఆడలేదనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక మ్యాచ్ విషయాకొస్తే.. ఉప్పల్‌ స్టేడియంలో 5 వికెట్ల తేడాతో లఖ్ నవూ విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (47; 28 బంతుల్లో 5×4, 3×6), అనికేత్‌ వర్మ (36; 13 బంతుల్లో 5×6) పరుగులు చేశారు. అనంతరం లక్ష్య చేధనలో నికోలస్‌ పూరన్‌ (70; 26 బంతుల్లో 6×4, 6×6) చెలరేగిపోయాడు. మిచెల్‌ మార్ష్‌ (52; 31 బంతుల్లో 7×4, 2×6) మెరుపులు మెరిపించాడు. దీంతో లఖ్‌నవూ 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 4 వికెట్లు తీసిన శార్దూల్‌ ఠాకూర్ కు శార్దూల్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

ishab-pant | srh | dhoni | ipl-2025 | telugu-news | today telugu news rishab-pant

Advertisment
Advertisment
Advertisment