India vs Pakistan: కోహ్లికి హగ్ ఇవ్వొద్దు.. వారితో చనువుగా ఉండొద్దు: టీమిండియాపై పాకిస్థాన్ గరంగరం!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ ఫ్యాన్స్ తమ క్రికెటర్లకు హెచ్చరికలు చేస్తున్నారు. తమ దేశానికి రాని భారత క్రికెటర్లతో చనువుగా ఉండొద్దని అంటున్నారు. విరాట్ కోహ్లికి హగ్‌లు ఇవ్వొద్దని చెబుతున్నారు.

New Update
Pakistan players to not hug Indian players during Champions Trophy 2025

Pakistan players to not hug Indian players during Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) కి రంగం సిద్ధమైంది. పలు జట్లు ఇప్పటికే తమ స్క్వాడ్‌ను వెల్లడిచాయి. ఫిబ్రవరి 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ టోర్నీలో అన్ని జట్ల మ్యాచ్‌లు ఒకెత్తయితే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ మరో ఎత్తనే చెప్పాలి. దాయదుల పోరంటే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. 

Also Read :  మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

ఫిబ్రవరి 23న మ్యాచ్

ఈ టోర్నీలో భాగంగా భారత్ - పాకిస్థాన్ (India v/s Pakistan) మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక గత 2017 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ పై విజయం సాధించి పాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. 

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

ఇదిలా ఉంటే పాక్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టీమిండియా (Team India) పై తీవ్ర గరంగరంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్‌గా గత రెండు ఐసీసీ టోర్నీల్లో భారత్‌ చేతిలో పాక్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అందువల్ల ఈసారి మాత్రం ఎలాగైనా టీమిండియాను చిత్తు చేయాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.

Also Read :  USA:  ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్

చనువుగా ఉండొద్దు

అది మాత్రమే కాకుండా ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు విముఖత చూపించినందుకు భారత్ ప్లేయర్లతో అంత చనువుగా ఉండొద్దని పాక్ ఫ్యాన్స్ తమ క్రికెటర్లను హెచ్చరిస్తున్నారు. అది మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీకి హగ్‌లు ఇవ్వొద్దని చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన ఓ వీడియోను పాక్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు