/rtv/media/media_files/2025/03/01/j3QX4BKO1Uzl2zr2UCmU.jpg)
Pakistan bomb blast amidst Champions Trophy 2025, 5 killed and several injured
Pakistan bomb blast
పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. పలు జట్ల మధ్య మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌లో పెను ప్రమాదం చేటుచేసుకుంది. ఆ దేశంలో ఊహించని భారీ బ్లాస్టింగ్ జరిగింది. పాకిస్తాన్ ఆత్మాహుతి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పేషావర్ అనే ప్రాంతంలో ఈ బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడు ప్రమాదంలో 5 మంది స్పాట్ లోనే మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కూడా పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
Bomb blast in Akora Khattak Madrassa in Nowshehra. pic.twitter.com/kJyGVzcMEv
— Zuhaib Murad🇵🇰 (@ZuhaibMurad4) February 28, 2025
గాయపడ్డవారిలో దేశ, విదేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. రంజాన్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఈ పేలుడు జరిగిందని స్థానిక పోలీసు అధికారులు నిర్ధారించారు. ఈ బాంబ్ బ్లాస్ట్‌తో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. వెంటనే సహాయక చర్యలకు పూనుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో పాకిస్తాన్‌లో ఉన్న విదేశీ క్రికెట్ జట్లు వణికిపోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
BIG BREAKING NEWS 🚨 B0mb blast in Pakistan amidst Champions Trophy Match.
— Times Algebra (@TimesAlgebraIND) February 28, 2025
At Least 5 Killed, Several Injured in Blast at Pro-Taliban Seminary Near Peshawar.
All Players of all countries are worried.
Due to security reasons only, India refused to play in Pakistan and its… pic.twitter.com/HrHRclSpbQ
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
కాగా ఈ బ్లాస్టింగ్ పాకిస్తాన్‌లోని ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో జరిగినట్లు సమాచారం. ఈ బాంబు పేలుడు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ జట్లు, అలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్‌లో ఉన్న 6 విదేశీ జట్లు గజగజ వణికిపోతున్నాయి. త్వరగా పాకిస్తాన్ వదిలి దుబాయ్ వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందే చెప్పిన బిసిసిఐ
ఎనిమిది జట్ల ఛాంపియన్స్ ట్రోఫీకి పిసిబి మొదట కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా నియమించింది. అయితే, భారత జాతీయ జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి బిసిసిఐ నిరాకరించింది. పాకిస్తాన్‌లో టోర్నమెంట్ ఏర్పాటు చేస్తే.. బ్లాస్టింగ్స్ జరిగే సమస్యలు ఉంటాయని మొత్తుకుంది. అక్కడికి అయితే భారత్ జట్టు రాదని తెలిపింది. దీంతో భారత్ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని పిసిబి చివరికి టోర్నమెంట్ కోసం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించింది. ఇందులో భాగంగానే దుబాయ్ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించేలా ప్లాన్ చేసింది.