/rtv/media/media_files/2025/04/01/xdkGEjqHuz8YcnqLyJci.jpg)
LSG vs PBKS IPL 2025 live score
లక్నో సూపర్ జెయింట్స్ VS పంజాబ్ కింగ్స్ మధ్య నేడు రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడిన లక్నో తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 172 టార్గెట్ ఉంది.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఇదిలా ఉంటే ఆట ఆరంభం నుంచి లక్నో జట్టు కష్టాల్లో పడింది. వరుస వికెట్లతో సతమతమైంది. స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ జట్టు బౌలర్స్ ఒక్కో వికెట్ తీస్తూ చెలరేగిపోయారు. మార్‌క్రమ్, మార్ష్, పంత్, పూరన్ వంటి బడా బ్యాటర్లను తక్కువ సమయానికి ఔట్ చేసి స్కోర్‌ను తగ్గించారు.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
మొదటి నుంచే తడబడ్డ లక్నో
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ క్రీజ్‌లోకి వచ్చారు. ఫస్ట్ ఓవర్‌లోనే లక్నో జట్టుకు గట్టి షాక్ తగిలింది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
మిచెల్ మార్ష్ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. అర్ష్‌దీప్ వేసిన 0.4 ఓవర్‌కు అతడు మర్కో యాన్సర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్కడ నుంచి ఈ ఇద్దరూ మంచి ఫామ్ కనబరిచారు. కానీ వరుస వికెట్లతో లక్నో కష్టాల్లో పడింది. దూకుడుగా ఆడిన మార్‌క్రమ్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
కష్టాల్లో లక్నో జట్టు
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఇక సిక్సర్లతో పూనకాలు తెప్పించిన పూరన్ కూడా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో స్టార్ బ్యాటర్లందరూ వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్నో జట్టు కష్టాల్లో పడింది. తక్కువ పరుగుల వద్దే ప్రస్తుతం ఉంది. 13 ఓవర్లకు గానూ లక్నో జట్టు 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. చూడాలి మరి ఫైనల్ ఎంత స్కోర్ చేస్తుందో.
(LSG VS PBKS | IPL 2025 | latest-telugu-news | telugu-news | rishabh-pant | nicholas-pooran)