/rtv/media/media_files/2025/04/12/RkZe9BSwcpvqW7dFxp6H.jpg)
LSG vs GT
ఐపీఎల్ 2025 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు జట్లు టైటిల్ కోసం పోటా పోటీగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ మరో మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే టాస్ నెగ్గిన లక్నో జట్టు.. మొదట బౌలింగ్ ఎంచుకుంది.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
10 ఓవర్లలో 0 వికెట్లు
దీంతో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు. మొదటి నుంచి ఓ వైపు దూకుడుగా.. మరోవైపు వికెట్లు నష్టపోకుండా పరుగులు రాబట్టారు. కొట్టాల్సిన దగ్గర పెద్ద పెద్ద షాట్లు కొట్టారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ఇలా 10 ఓవర్లలో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ పడకుండా 101 పరుగులు చేసింది. దీంతో 100 పరుగులు ఇచ్చినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు తలలుపట్టుకున్నారు.
5️⃣0️⃣ For Captain Shubman gill in just 31 balls!!
— Zara Khan (@ZaraKhan1161526) April 12, 2025
1️⃣0️⃣0️⃣ Partnership for Captain Shubman gill & Sai Sudarshan in just 9.4 overs.
Biggest opening in this season 🔥#Lsgvsgt #GTVSLSG #SHUBMANGILL #GUJARATTITANS #SAISUDARSHAN #PARTNERSHIP pic.twitter.com/yXudTgnh2Y
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
రెండు హాఫ్ సెంచరీలు
అదే సమయంలో ఓపెనర్ గిల్(60)ను ఔట్ చేశారు. ఎట్టకేలకు ఓపెనర్ల భాగస్వామ్యానికి (73 బంతుల్లో 120 పరుగులు) లక్నో జట్టు తెరదించింది. ఇక ఆ తర్వాతే సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్ (56) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రవి బిష్ణోయ్ వేసిన 13.1 ఓవర్లో నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ వెనుదిరిగాడు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (2) సైతం వెను వెంటనే చేతులెత్తేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. దీంతో గుజరాత్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ (1*), బట్లర్ (9*) పరుగులతో ఉన్నారు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
(LSG vs GT | latest-telugu-news | IPL 2025 | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-sports-news | telugu-cricket-news)