KKR Vs RR: రియాన్ పరాగ్ మళ్లీ ఫెయిల్.. గెలుపు దిశగా కోల్‌కతా!

KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ స్వల్ప స్కోర్ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR.. కేకేఆర్ బౌలర్లధాటికి 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. RR కెప్టెన్ రియాన్ పరాగ్ మళ్లీ నిరాశపరిచాడు.

New Update
kkr vs rr

kkr vs rr Photograph: (kkr vs rr)

IPL 2025: KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ స్వల్ప స్కోర్ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR.. కేకేఆర్ బౌలర్లధాటికి 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. 

రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్‌ జురెల్ (33; 28 బంతుల్లో 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు శాంసన్ (13; 11 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్ రియాన్ పరాగ్ (25; 15 బంతుల్లో 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినప్పటికీ క్రీజులో నిలవలేకపోయాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, మొయిన్‌ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. స్పెన్సర్ జాన్సన్‌కు ఒక వికెట్ పడగొట్టాడు. 

ipl-2025 | rajastan | telugu-news | rtv telugu news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS RR: చివర వరకూ సా...గిన మ్యాచ్..రాజస్థాన్ కు మొదటి గెలుపు

మామూలుగా టీ20ల్లో 11 లేదా అయ్యేసరికి మ్యాచ్ ఉవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ మాత్రం సాగతీతలా అయింది. 15 ఓవర్లు అయినా కూడా ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టమైంది. చివర వరకూ సా...గిన మ్యాచ్ లో ఆర్ఆర్ విజయం సాధించింది.

New Update
ipl

CSK VS RR

రాజస్థాన్ రాయల్స్ కు మొదటి గెలుపు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువాహటిలో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయిన ఆర్ఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ టీమ్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి సీఎస్కేకు 184 లక్ష్యాన్ని ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాటర్లకు మొదటి ఓవర్లోనే ఝలక్ తగిలింది.  మూడో బంతికే సీఎస్కే తన మొదటి వికెట్ ను కోల్పోయింది. తరువాత కూడా చాలా తొందరగానే మరో రెండు వికెట్లు పడిపోయాయి. రచిన్ రవీంద్ర 0, రాహుల్ త్రిపాఠీ 23, శివమ్ దూబే 18, విజయ్ శంకర్ 9లు వరుసగా అవుట్ అయిపోయారు. కానీ చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాత్రం పట్టుదలగా ఆడాడు. వికెట్లు పడిపోతున్నా అవతలి ఎండ్ లో నిలబడి బ్యాటింగ్ చేశాడు.  63పరుగులు చేసి టీమ్ గెలిపించడానికి కష్టపడ్డాడు. అసలు ఈరోజు మ్యాచ్ చివర వరకూ సాగింది. చివర వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమైంది. 19వ ఓవర్లో కూడా చెన్నై మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించాయి. కానీ 19 ఓవర్లో సందీప్ బౌలింగ్ లో ధోని అవుట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఆర్ఆర్ సొంతమైంది. ఆర్ఆర్ టీమ్ లో ఈరోజు బ్యటార్లలో నితీశ్ రాణా హీరో అయితే బౌలర్లలో హసరంగ హీరో. నాలుగు వికెట్లు తీయడమే కాక చాలా ముఖ్యమైన బ్యాటర్లను అవుట్ చేశాడు.  మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ ఆరుపరుగుల తేడాతో విజయం సాధించింది. 

మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్..

గువాహటి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(81), రియాన్‌ పరాగ్‌ (37), సంజుశాంసన్‌ (20), హిట్‌ మయర్‌ (19) ఫర్వాలేదనిపించగా..  మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి బంతికే ఫోర్‌ బాది మంచి ఊపుమీద కనిపించిన ఓపెపర్  జైస్వాల్‌ (4) వెంటనే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణాతో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు సంజుశాంసన్‌. ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు.  ఈ క్రమంలోనే  21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. 

రియాన్‌ పరాగ్‌ భారీ షాట్లతో..

మంచి ఊపుమీదున్న రాజస్థాన్ కు నూర్‌అహ్మద్‌ బిగ్‌ షాక్ ఇచ్చాడు. అతని బౌలింగ్ లో  రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి సంజు శాంసన్‌ (20) వెనుదిరిగాడు. దీంతో వీరి 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోపక్కా నితీశ్‌ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో 81 పరుగుల వద్ద..  భారీ షాట్‌ కొట్టేందుకు ముందుకు వచ్చి ధోనీ స్టంపింగ్‌ కు దొరికిపోయాడు.  కేవలం 36 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు నితీశ్‌ రాణా. అనంతరం  ధ్రువ్‌ జురేల్‌ (3),  హసరంగ (4) వెనువెంటనే ఔట్‌ అయ్యారు. దీంతో  రాజస్థాన్ కష్టాల్లో పడింది. చివర్లో రియాన్‌ పరాగ్‌ (37) భారీ షాట్లతో అలరించడంతో రాజస్థాన్ భారీ  చేసింది. చెన్నై  బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగా.. మథీష పతిరానా మూడు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | ipl-2025 | csk | match 

Also Read:Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment