/rtv/media/media_files/2026/05/25/virat-kohli-travis-head-2026-05-25-12-51-30.jpg)
Virat kohli-Travis head
ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌ల మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. అది కాస్త ఇప్పుడు హెడ్ కుటుంబ సభ్యులపై ఆన్‌లైన్ వేధింపులకు దారితీసింది. అయితే ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌ల మధ్య చిన్న గొడవ జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ, హెడ్‌తో షేక్‌హ్యాండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో కొందరు నెటిజన్లు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా సోషల్ మీడియా ఖాతాలపై విమర్శలు, వేధింపులతో దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా స్పందించారు.
ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!
Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳
— Jeet (@JeetN25) May 23, 2026
But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T
ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!
గెలవడం వల్ల మొదలైన వేధింపులు..
ఉదయం నిద్ర లేచే సరికి సోషల్ మీడియా ఖాతాలన్నీ కూడా అసభ్యకరమైన కామెంట్లతో నిండిపోయాయని అన్నారు. అయితే తనను విమర్శించినా పర్లేదు.. కానీ కుటుంబ సభ్యులను కూడా అనడం కరెక్ట్ కాదన్నారు. గతంలో కూడా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎలాంటి వేధింపులు ఎదురయ్యాయో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. అయితే భారత్‌పై ఆస్ట్రేలియా గెలిచిన ప్రతిసారి ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నాయని ఆమె బాధపడడ్డారు.
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విన్ అయిన తర్వాత కూడా కొందరు తమను టార్గెట్ చేశారని ఆమె అన్నారు. ఆటలో గెలిచినందుకు ఇలాంటి వ్యక్తిగత దాడులు చేయడం కరెక్ట్ కాదని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇప్పటికైనా దాడులు ఆపాలని అన్నారు.
Follow Us