R Pant: స్టుపిడ్‌ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్

రిషబ్ పంత్‌ను సునీల్ గావస్కర్ పొట్టుపొట్టు తిట్టారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ర్యాంప్ షాట్ ఆడి ఔట్ కావడంతో 'స్టుపిడ్ షాట్. స్టుపిడ్ సెలక్షన్. భారత డ్రెస్సింగ్ రూమ్ వెళ్లొద్దు. ఇది టీ20 క్రికెట్ అనుకుంటున్నావా' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

author-image
By srinivas
New Update
rishab pant sunil g

స్టుపిడ్ షాట్.. పంత్ పై గావస్కర్ ఫైర్

Ind Vs Aus: భారత క్రికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కిచాల్సిందిపోయి చెత్త షాట్ ఆడతావా అంటూ మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ర్యాంప్‌ షాట్‌ కొట్టాల్సిన అవసరం ఏముందని, భారత డ్రెస్సింగ్ రూమ్ వెళ్లొంద్దంటూ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి..

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య ఆడిలైడ్ వేదికగా 4వ టెస్టు జరుగుతోంది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ బోలాండ్‌ వేసిన బంతిని ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రిషబ్ పంత్. కానీ అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని బౌండరీ లైన్ వద్ద నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో 28 పరుగులు చేసి పెవిలియన్ వైపు వెళ్తున్న రిషబ్ పంత్ ను ఉద్దేశిస్తూ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశారు. 

డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లొద్దు..

‘స్టుపిడ్‌ షాట్.. స్టుపిడ్ సెలక్షన్. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లొద్దు. వేరేవారి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లు. అనవసర షాట్లు, అనవసర రన్నింగ్స్ చేస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి షాట్స్ ఆడాల్సిన అవసరం లేదు. టీ20 లేదా 50 ఓవర్ల క్రికెట్ అనుకుంటున్నారా. టెస్టుల్లో సహనం ఉండాలి' అంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మొరిగే కుక్కలన్నీ ధోనీ ఆటను చూశాయనుకుంటున్నా: తమన్ పోస్ట్!

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు.

New Update
dhoni thaman

dhoni thaman

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని పోస్టులో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉంది.  

ఉర్రూతలూగించిన ధోనీ 

అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా  18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) చివరి వరకూ పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

#telugu-news #sports #Chennai Super Kings #punjab-kings #PBKS vs CSK
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు