ICC Mens T20 World Cup: భారత్‌తో మేం ఆడం.. పాక్‌ ప్రధాని షెహబాజ్ సంచలన నిర్ణయం

టీ20 వరల్డ్ కప్‌ 2026లో పాకిస్థాన్, భారత్‌తో మ్యాచ్‌ ఆడదని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ అధికారికంగా ప్రకటించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పూర్తిగా ఆడకపోవడానికి గల కారణాలను షెహబాజ్ తెలపలేదు.

New Update
PM Shehbaz Sharif

PM Shehbaz Sharif

టీ20 వరల్డ్ కప్‌ 2026(ICC Mens T20 World Cup 2026) లో పాకిస్థాన్(pakistan), భారత్‌(india)తో మ్యాచ్‌ ఆడదని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ అధికారికంగా ప్రకటించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పూర్తిగా ఆడకపోవడానికి గల కారణాలను షెహబాజ్ తెలపలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. కానీ భారత్‌లో భద్రత బాగుందని తేల్చిన ఐసీసీ అందుకు నిరాకరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా వారి స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తూ.. పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని అంటోంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ సీరియస్ అయ్యింది.

ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు..  ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!

ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!

నిధులు నిలిపివేస్తామని..

కేవలం తమకు నచ్చిన జట్లుతోనే ఆడతామనడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ మ్యాచ్‌ను ఆడకపోతే ఆ జట్టుపై ఐసీసీ కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా టోర్నీ నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్ క్రికెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంటే.. పాక్‌కు వచ్చే నిధులు అన్ని ఆగిపోతాయి. దీంతో ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చూడండి: Mahesh kumar Goud : పవన్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి:  మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్

Advertisment
తాజా కథనాలు