/rtv/media/media_files/2025/04/12/teMD2YTENLrR16gqoVWO.jpg)
Gujarat titans All-rounder Glenn Phillips out from IPL tournament
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను గాయలబెడద వేధిస్తోంది. ఇప్పటికే కీలక పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరమవగా తాజాగా మరో ఆల్ రౌండర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గ్రౌండ్ లో చాలా యాక్టివ్ గా ఉండే న్యూజీలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయపడ్డాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇబ్బంది పడుతూ కనిపించగా స్కానింగ్ లో గజ్జల్లో గాయమైనట్లు తేలింది. దీంతో ఫలిప్స్ తర్వాతి మ్యాచ్ లు ఆడటం కష్టంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. టోర్నీ మొత్తానికి అతను దూరమవుతాడని, తాను త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు మేనేజ్‌మెంట్ కూడా తెలుపుతూ పోస్ట్ పెట్టింది.
Also Read : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు
Glenn Phillips won't be able to finish the IPL 2025 season due to a groin injury sustained during the match against Sunrisers Hyderabad on April 6.
— Doordarshan Sports (@ddsportschannel) April 12, 2025
Wishing him a speedy recovery!#Gujarat #IPL2025 #GlennPhillips @IPL pic.twitter.com/aGMH5TMgnr
Also Read : భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
5 మ్యాచుల్లో 4 విజయాలు..
ఇదిలా ఉంటే.. 5 మ్యాచుల్లో 4 విజయాలు సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే శనివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడనుండగా ఫలిప్స్ దూరం కావడం జట్టుకు నష్టంగానే చెప్పొచ్చు.
Also Read : గుజరాత్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా పడిపోయిన వికెట్లు- 15 ఓవర్లకు ఎంత స్కోరంటే?
మరోవైపు సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణతో కూడిన పేస్ దళం అదరగొడుతోంది. ఇక గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం 5 మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన పంత్ టీమ్.. 6 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
Also Read : అమెరికా టారిఫ్ ఎఫెక్ట్.. ఎగుమతి సవాళ్లు ఎదుర్కొంటున్న చైనా
telugu-news | today telugu news | gujarat-titans | latest-telugu-news | telugu-sports-news | telugu-cricket-news