/rtv/media/media_files/2025/03/10/J6msIxReQTWsoPa1Svdl.jpg)
modicricket
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తరువాత ఈ టైటిల్ సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. టీమ్ ఇండియా విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్ ..అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
Also Read: Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!
టోర్నమెంట్ సాంతం అద్భుతంగా ఆడారంటూ జట్టు సభ్యులను ప్రశంసించారు. మరో వైపు వన్ టీమ్..వన్ డ్రీమ్ ..వన్ ఎమోషన్ అంటూ పేర్కొంటూ బీసీసీఐ మ్యాచ్ ఫొటోలను షేర్ చేసింది.
Also Read: Mark-carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మూడు సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.స్మాషింగ్ విక్టరీ..భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొగేలా చేశారంటూ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.
చరిత్ర సృష్టించిన విజయమిది.భారత క్రీడాకారుల అద్భుతమైన సామర్థ్యం, మైదానంలో తిరుగులేని ఆధిపత్యం దేశాన్ని గర్వపడేలా చేసిందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టీమిండియా కి శుభాకాంక్షలు తెలియజేశారు. టీమ్ ఇండియా తన అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి మనల్ని గర్వపడేలా చేసింది.కృషి, అంకిత భావంతో అద్భుతమైన విజయం సాధించిన జట్టుకు అభినందనలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాచ్ చివరి వరకుపోరాట స్ఫూర్తి కనబర్చే న్యూజిలాండ్ జట్టు పై భారత్ అద్భుతమైన ఆటతో విజయం సాధించింది. టీమ్ ఇండియాకు వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ఐసీసీ ఛైర్మన్ జైషా అభినందనలు తెలియజేశారు.
టీమిండియా మైదానంలో నైపుణ్యాన్ని ,ఆధిపత్యాన్ని ప్రదర్శించి. రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించారని నారా లోకేశ్ ప్రశంసించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారత జట్టులోని ఆటగాళ్లందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
Also Read:BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం