/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dhoni-jpg.webp)
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో మోస్ట్ ఫేవరెట్ ఎవరంటే..వినిపించే పేరు ఒక్కటే. తలా ధోనీ. మిస్టర్ కూల్ ఆటను చూసేందుకే ఇప్పటికీ జనాలు వస్తారు. ధోనీ క్రీజులో కనిపిస్తే చాలు పెద్ద ఎత్తున హోరు వినిపిస్తుంది. చెన్నై జట్టుకు కీపర్ బ్యటర్ గా ఉన్న ధోనీ ఇంతకు జట్టు కెప్టెన్ గా ఉండేవాడు. లాస్ట్ గా చెన్నైకి ధోనీ 2023లో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సీజన్ లో అద్భుత ప్రదర్శనతో జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. మొత్తంగా చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ కప్ ను గెలుచుకుంది. అదంతా మహీ కెప్టెన్సీలోనే సాధ్యమైంది. ఆ తరువాత నుంచి చెన్నైకు రుతురాజ్ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు.
రెండు సీజన్ల తర్వాత..
లాస్ట్ రెండు సీజన్లగా ధోనీ కీపింగ్ చేస్తూ బ్యాటర్ గా ఉంటున్నాడు. ఈ సీజన్ లో కూడా అదే చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడానికి కూడా ఆరు లేదా ఏడో స్థానంలో వస్తున్నాడు. చెన్నై ఇప్పటికి రెండు మ్యాచ్ లు ఆడింది. ఈరోజు మూడోది ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో మళ్ళీ తలా కెప్టెన్ గా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ ను ధోనీ నడిపించనున్నాడు. ఎందుకంటే ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు గాయం అయింది. అతను పూర్తిగా ఇంకా కోలుకోలేదు. చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా అతడి ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తామని తెలిపాడు. అతడు ఆడేది.. లేనిది.. మ్యాచ్ రోజే నిర్ణయం తీసుకుంటామని సూపర్ కింగ్స్ బ్యాటింగ్ జట్టు మైఖేల్ హస్సీ స్పష్టం చేశారు. రుతురాజ్ ఈ మ్యాచ్‌కు దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరికి అవకాశం ఇస్తారని ప్రశ్నించగా.. స్టంప్స్ వెనకలా చురుగ్గా కదిలే ఓ ‘యువకుడికి’ అంటూ హింట్ ఇవ్వడంతో...ధోనయే కెప్టెన్ అని తెలుస్తోంది. కాబట్టి ఈరోజు మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పండుగే అవనుంది.
today-latest-news-in-telugu | chennai | Chennai Super Kings | dhoni | csk | captain
Also Read: Earth quake: రోజూ ఎక్కడోచోట భూకంపం..తాజాగా పపువా న్యూ గినియాలో..