/rtv/media/media_files/2025/03/23/imrVkGlxbQslvcCRmpvZ.jpg)
dhoni Photograph: (dhoni )
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై మరోసారి చర్చ మొదలైంది. గత సీజన్‌లోనే తప్పుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరగగా.. తాజాగా 18వ సీజన్ మొదలవడంతో మరోసారి వీడ్కోలు పలకబోతున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఈ ఎడిషన్ తర్వాత గుడ్‌బై చెబుతాడనే వాదనలు మొదలయ్యాయి. అయితే దీనిపై తాజాగా రియాక్ట్ అయిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. అలాంటిదేమీలేదని కొట్టిపారేశాడు. ఆదివారం ముంబైతో (CSK vs MI) మ్యాచ్ సందర్భంగా మాట్లాడిన రుతురాజ్... ధోనీ వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే ఫ్రాంచైజీ గ్రౌండ్ లోకి తీసుకెళ్తుందని తెలిపాడు.
Also Read : అబుదాబి స్వామి నారాయణ్ మందిర్ లో అల్లు అర్జున్.. అక్కడ ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
FIRST BATTLE! BEST BATTLE!🤜💥🤛#CSKvMI #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/VMBqi4o7UU
— Chennai Super Kings (@ChennaiIPL) March 23, 2025
Also Read : ఈ కాయ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య క్లియర్
వీల్‌ఛైర్‌లో ఉన్నాసరే..
ఈ మేరకు ఇటీవల ధోనీ మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు రుతురాజ్. ‘చెన్నై సూపర్ కింగ్స్ నా ఫ్రాంచైజీ. ఈ టీమ్ తరఫున మరింతకాలం ఆడాలనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నాసరే నన్ను లాక్కెళ్లిపోతారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యల చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. ధోనీతో చాటింగ్ చేయడం ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘జట్టులో చాలా మంది లోకల్ ప్లేయర్లున్నారు. వారంతా ధోనీ చుట్టూ కుర్చొని ముచ్చటించడం భలేగా అనిపిస్తుంది. ఎవరైనా సరే అతడితో చాలా తేలిగ్గా మాట్లాడే వీలుంటుంది. ధోనీ అసలే కంగారు పడడు. నిశ్శబ్దంగా ఉంటూ భావోద్వేగాలను బయట పెట్టుకుండా ముందుకు సాగిపోతాడు. ధోనీ, రవీంద్ర జడేజాతో కలిసి గత రాత్రి 11.30 గంటల వరకు ప్రాక్టీస్ చేశా. మనం ఏ ప్రపంచంలో ఉన్నామని అనుకున్నా. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. బంతులను బాదేస్తూనే ఉన్నామంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Also Read : కేసీఆర్కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
1️⃣8️⃣ Years of @IPL
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2025
1️⃣ THALA. 🦁#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/bEsqwLB8jn
Also Read : ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే : RCB కెప్టెన్ పాటీదార్
retirement | ms-dhoni | ipl-2025 | latest-telugu-news | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news