/rtv/media/media_files/2025/04/05/jVhR3pdA0kfSD3lft6qO.jpg)
Delhi Capitals
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 15 ఏళ్లకి తర్వాత చెపాక్ స్టేడియంలో ఢిల్లీ గెలవడం విశేషం. చివరిసారిగా 2010లో అక్కడ గెలిచింది.
Also read: గెలిచిన సంతోషమే లేదు కదరా.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK.. 5 వికెట్లు కోల్పోయి కేవలం 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 69తో స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది.ధోని 30, దూబే 18 పరుగులు చేశారు. జడేజా 2, విప్రాజ్ 2 పరుగులతో నిరాశపర్చారు. ముకేశ్, కుల్దీప్‌లు తలో వికెట్ తీశారు. తొలుత టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ డకౌట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ పొరెల్ వరుసగా 4,6,4,4 బాదాడు. ఆ తర్వాత అభిషేక్‌ని జడేజా తన తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ 21 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిపోయాడు.
𝐰𝐰𝐰.delhicapitals.win
— Delhi Capitals (@DelhiCapitals) April 5, 2025
Thank you, Chepauk 🤗 pic.twitter.com/aLEkKB8v98
Also Read: తిలక్ వర్మకు ఘోర అవమానం.. హార్దిక్ ఇది నీకు న్యాయమేనా?
12 ఓవర్లకు స్కోరు 100 దాటింది. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. ఫామ్‌లో ఉండి బాల్‌ను బౌండరీలకు పంపించారు. రిజ్వీని 17వ ఓవర్‌లో ఖలీల్ ఔట్ చేశారు. పతిరన వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రాహుల్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఇక అశుతోష్ శర్మ ఒక్క పరుగుతో రనౌట్ అయ్యాడు. మొత్తానికి స్కోర్ 183 పరుగులకు చేరుకుంది. బరిలోకి దిగిన సీఎస్‌కే లక్ష్యాన్ని ఛేదించలేక వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది.