PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.

New Update
ipl

PBK VS CSK

చెన్నై కథ ఇక ముగినట్లే. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆప్స్ ఆశలు మూసుకుపోయినట్టే. ఈరోజు పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్ తో బరిలోకి దిగిన  చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్‌ కాన్వే  49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. తరువా శివమ్‌ దూబె  27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42, రచిన్‌ రవీంద్ర  23 బంతుల్లో 6 ఫోర్లతో 36, ధోనీ  12 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి రాణించారు. అయితే నిర్ణీ ఓవర్లలో టర్గెట్ ను మాత్రం చేరుకోలేకపోయారు.  పంజాబ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, మాక్స్‌వెల్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. చెన్నైకి ఇది వరుసగా ఇది నాలుగో ఓటమి.

ప్రియాంశ్ ఆర్య సెంచరీ..

అంతకు ముందు పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్‌ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు. ముల్లనూర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సార‌థి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు చెన్నై బౌలర్లు సైతం వరుస వికెట్లు పడగొట్టారు. ప్రియాన్ష్ మినహా ఏ బ్యాటర్ ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరల్లో శశాంక్ 52 మెరుపులు మెరిపించాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | csk | match | punjab 

Also Read: Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment