/rtv/media/media_files/2025/02/20/D3JdI6C3TfgEg9jwiFR4.jpg)
IND vs BAN: Ravindra Jadeja dropped Gautam Gambhir makes a sensational move
పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) అట్టహాసంగా నిన్న (బుధవారం) ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దాదాపు 60 పరుగుల తేడాతో మొదటి విజయశంఖం మోగించింది. ఇక ఇవాళ భారత్ vs బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
Ind vs Ban
ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్‌లో కాకుండా దుబాయ్‌లో జరగనుంది. దీని కోసం టీమిండియా (Team India) జట్టు యూఏఈలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ మ్యాచ్‌లో ప్లేస్ కష్టమేనని తెలుస్తోంది.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
తుది జట్టులో జడేజా (Jadeja) కు స్థానం కష్టమేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నెట్స్ సెషన్‌ను స్వయంగా పర్యావేక్షించాడు. అక్కడే జడేజాతో సుధీర్ఘంగా మంతనాలు జరిపాడు. ఆ తర్వాత చివర్లో అతడిని హగ్ చేసుకున్నాడు. ఇది నెట్టింట వైరల్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ సంప్రదించింది.
ప్లేస్ కష్టమే?
నేడు బంగ్లాదేశ్‌తో జరగనున్న తుది జట్టులో జడేజా ఆడటం లేదా? అని ప్రశ్నించగా.. అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్నది భారత్ వ్యూహమని ఆయన అన్నాడు. ఈ తరుణంలో జడ్డూకి స్థానం కష్టం కావచ్చు అని అతడు అభిప్రాయపడ్డాడు. ఇక జట్టులో అక్షర్, కుల్దీప్ స్పిన్నర్ల స్థానాలు దాదాపు ఖాయమన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.