/rtv/media/media_files/2025/01/14/Y4CUirvTwQKYWkivOPrO.jpg)
IPL 2025 Photograph: (IPL 2025)
IPL 2025: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడంతో ఆటగాళ్లపై బీసీసీఐ(BCCI) గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది. 2019కి ముందు అమలులో ఉన్న నిబంధనలను మళ్లీ అమలు చేయాలని బోర్డు పరిశీలిస్తోంది. జట్టులో VVIP కల్చర్‌ను తగ్గించేందుకు ఇకపై అందరూ టీమ్ బస్సులోనే ప్రయాణించాలని బీసీసీఐ ఆదేశించింది.
Also Read: Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి తరువాత బీసీసీఐ 2025 జనవరి 11న ముంబైలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) లు హాజరయ్యారు. ఈ సమీక్షలో మార్గదర్శకాలను సూచించింది.
Also Read: Cricket: కెప్టెన్సీ రేసులో జైశ్వాల్...కోచ్ గంభీర్ మద్దతు
పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులు
భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది. ఈ రూల్ వల్ల మొత్తం టోర్నమెంట్‌లో ఆటగాళ్ల తమ భార్యలతో ఉండలేరు. ముఖ్యంగా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల ప్రదర్శనను కుటుంబ సభ్యులు ప్రభావితం చేస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో చాలా మంది క్రికెటర్ల భార్యలు ఆస్ట్రేలియాలో ఉన్నారు.
Also Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
అంతేకాకుండా ఆటగాళ్ల బ్యాగేజ్ 150 కేజీల కన్నా ఎక్కువ ఉండకూడదని బీసీసీఐ కండిషన్ పెట్టింది. ఒకవేళ ఉంటే ఆటగాళ్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అతని పర్సనల్ మేనేజర్ వేరే బస్సులో ప్రయాణించాల్సి ఉంటుందని, వీఐపీ బాక్సులో కూర్చోవడానికి వీల్లేదంటూ బీసీసీఐ తేల్చింది. వీరు మరో హోటల్‌లో కూడా బస చేయాల్సి ఉంటుంది.
కాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. త్వరలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్(IPL 2025
Also Read : ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క