/rtv/media/media_files/2025/02/15/dVsw672XVNYe0SBQW0j5.jpg)
Olympics 2036 Photograph: (Olympics 2036)
Amit Shah- Olympics 2036: భారతీయ క్రీడా అభిమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండియా(India to host 2036 Olympics) సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. క్రీడల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. 2014లోమోదీ(PM Modi) ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రూ.800 కోట్లు మాత్రమే ఉన్న క్రీడల బడ్జెట్.. ఇప్పడు రూ.3800 కోట్లకు చేరుకుందని కొనియాడారు. క్రీడల పట్ల మోదీ ప్రభుత్వం చూపిప్తున్న చొరవ, అంకితభావానికి ఇదే నిదర్శనం అన్నారు.
ఇది కూడా చదవండి: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
దేవ భూమి ‘ఖేల్ భూమి’గా..
ఈ మేరకు ఉత్తరాఖండ్ 38వ జాతీయ క్రీడల(/38th National Games Uttarakhand) ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. క్రీడాకారుల సత్తాతో ఉత్తరాఖండ్ దేవ భూమి ‘ఖేల్ భూమి’గా రూపాంతరం చెందిందన్నారు. గత క్రీడల్లో పతకాల పట్టికలో 21వ స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ ఈసారి 7వ ర్యాంకు సాధించడంపై ప్రశంసలు కురిపించారు. ఈ సదర్భంగానే ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ రెడీ ఉందన్నారు. భారతీయ క్రీడాకారులు పతకాలు సాధించేందుకు సన్నద్ధం కావాలని పిలపునిచ్చారు. ఇక ఈ పోటీలు ముగిసిన సందర్భంగా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉష.. మేఘాలయా సీఎం కాన్రాడ్ సంగ్మాకు క్రీడల పతాకాన్ని అందించారు. దీంతో తదుపరి జాతీయ క్రీడలు మేఘాలయాలో జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna : అమరావతికి బాలయ్య గుడ్ న్యూస్ !
టాప్‌లో ఉన్న జట్లు..
ఈ జాతీయ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ 121 పతకాలను గెలిచి టాప్ లో నిలిచింది. 68 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్, 27 బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంది. మహారాష్ట్ర 198 పతకాలతో 2 స్థానంలో నిలిచింది. హర్యానా 153 పతకాలతో 3 స్థానం, కర్ణాటక, మధ్యప్రదేశ్ 4, 5వ స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 12 పతకాలను సాధించింది. 7 గోల్డ్, ఒక రజతం, 6 కాంస్యాలను సాధించి 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3 గోల్డ్ మెడల్స్, 3 రజత పతకాలు, 12 కాంస్య పతకాలతో 18 మెడల్స్ దక్కించుకని 26వ స్థానంలో నిలిచింది.